ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 273

ABN, Publish Date - Apr 03 , 2024 | 09:35 PM

విశాఖలో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను చీల్చి చెండాడారు. సునీల్ నరైన్ విధ్వంసకర ఇన్సింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 85 పరుగులు చేశాడు.

విశాఖలో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బౌలర్లను చీల్చి చెండాడారు. ఓపెనర్ సాల్ట్ 18 పరుగులు మాత్రమే చేశాడు. సునీల్ నరైన్ విధ్వంసకర ఇన్సింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఇషాంత్ శర్మ వేసిన ఓవర్‌లో మూడు సిక్సులు, రెండు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్‌‌లో ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. నరైన్‌కు రఘువంశీ జతకలిశాడు. యువ సంచలనం 27 బంతుల్లో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. రస్సెల్ మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. 19 బంతుల్లో 41 పరుగులు చేశాడు. 18 పరుగులు చేసి శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచింది. నరైన్‌ను ఓపెనర్‌గా పంపించాలనే గౌతమ్ గంభీర్ ప్లాన్ సక్సెస్ అయ్యింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

IPL 2024: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నైకి బిగ్ షాక్?.. ఆ స్టార్ ప్లేయర్ ఆడడంపై అనుమానం

Updated Date - Apr 03 , 2024 | 09:38 PM

Advertising
Advertising