స్వదేశానికి ఇంగ్లండ్ క్రికెటర్లు
ABN , Publish Date - May 14 , 2024 | 05:01 AM
ఐపీఎల్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు లీగ్‌ను వీడనున్నారు. ఈనెల 22 నుంచి పాకిస్థాన్‌తో ఆ జట్టు నాలుగు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. టీ20 ప్రపంచక్‌పనకు ముందు..

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు లీగ్‌ను వీడనున్నారు. ఈనెల 22 నుంచి పాకిస్థాన్‌తో ఆ జట్టు నాలుగు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. టీ20 ప్రపంచక్‌పనకు ముందు దీన్ని సన్నాహకంగా భావిస్తుండడంతో ఐపీఎల్‌లో ఆడే తమ క్రికెటర్లను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెనక్కి రమ్మని ఆదేశించింది. దీంతో విల్ జాక్స్, టోప్లేతో పాటు రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ ఇప్పటికే భారత్ వీడారు. వీరితో పాటు ఇదే వారంలో మొయిన్ అలీ, బెయిర్‌స్టో, కర్రాన్, ఫిల్ సాల్ట్ కూడా ఇంగ్లండ్ పయన మవుతారు. పంజాబ్ బ్యాటర్ లివింగ్‌స్టోన్ వెళ్లినా అతడు గాయంతో బాధపడుతున్నాడు. దీంతో పాక్‌తో సిరీ్‌సకు అతడు దూరంగా ఉండే చాన్సుంది.