Share News

Remand: పోసానిపై మరో కేసు..14 రోజుల రిమాండ్..

ABN , Publish Date - Mar 05 , 2025 | 07:21 AM

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కర్నూలు జిల్లా, ఆదోనిలో మరో కేసు నమోదైంది. దీంతో పోలీసులు పీటీ వారెంట్‌పై గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలుకు తరలించారు. విచారణ జరిపిన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణా పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్‌కు విధించారు.

Remand: పోసానిపై మరో కేసు..14 రోజుల రిమాండ్..
Posani 14 days Remand

కర్నూలు జిల్లా: రచయిత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali)కి షాక్ (Shock) తగిలింది. ఆయనపై మరో కేసు (Another Case) నమోదైంది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై పోసాని అసభ్యకరంగా మాట్లాడరని (Comments) ఆదోని మూడో పట్టణ పోలీసులకు జనసేన నేత (Janasena Leader) మలిశెట్టి రేణువర్మ (Renu Varma) ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై కేసు నమోదు చేసిన పోలీసులు పీటీ వారెంట్‌పై గుంటూరు నుంచి కర్నూలుకు తీసుకొచ్చారు. ఆదోని కోర్టు జడ్జి సెలవుల్లో ఉండటంతో ఇంచార్జీ కర్నూలు కోర్టు న్యాయాధికారి ముందు పోసానిని హాజరు పరిచారు. విచారణ జరిపిన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణా పోసాని కృష్ణమురళికి 14 రోజు రిమాండ్‌కు విధించారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.

Read More..:

రాష్ట్రాన్ని దివాలా తీయించిన వైసీపీ


వైసీపీ లీగల్ సెల్ నాయకుడు సువర్ణ రెడ్డి కామెంట్స్....

పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పోసానిని గుంటూరు నుంచి పోలీసులు తరలించే క్రమంలో అతనికి ఆరోగ్యం బాగా లేదని, చేయి, నడుము నొప్పి ఉందని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, వీటిపై పోరాటం చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2.0 ను తీసుకొస్తారని సువర్ణ రెడ్డి అన్నారు.


పోసాని జుగుప్సాకర వ్యాఖ్యలు: రేణువర్మ

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కర్నూలు జిల్లా ఆదోని త్రీటౌన్‌ పోలీసులు పీటీ వారెంట్‌పై గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళవారం కర్నూలుకు తరలించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుడుగా పోసాని జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణ అధ్యక్షుడు మలిశెట్టి రేణువర్మ గత ఏడాది నవంబరు 14న త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు గురించి జగన్‌ మీడియాలో అసభ్యకరంగా దూషించారని, కృష్ణమురళి మాట్లాడిన మాటలకు కొన్ని వర్గాల్లో విద్వేషాలు రగిలి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్‌పై ఆదోని త్రీటౌన్‌ సీఐ రామలింగమయ్య ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడ నుంచి తీసుకువచ్చారు. అనంతరం.. ఆదోని ఏజేఎఫ్‌సీఎం కోర్టు ఇన్‌చార్జి న్యాయాధికారి అపర్ణ నివాసం వద్ద అర్ధరాత్రి సమయంలో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ మేరకు రిమాండ్ విధించారు.

నాపై కేసులు కొట్టివేయండి.. హైకోర్టుకు పోసాని

‘‘సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహా వారి కుటుంబ సభ్యులు, మీడియా సంస్థలు, కమ్మ సామాజికవర్గాన్ని దూషించానంటూ రాష్ట్రంలోని 4 పోలీస్‌ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టివేయండి.’’ అని అభ్యర్థిస్తూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి మంగళవారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా తదుపరి చర్యలను నిలువరించాలని అభ్యర్థించారు. ‘‘పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నాకు వర్తించవు. నా వ్యాఖ్యలతో సమాజ శాంతికి భంగం కలగనందున బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 353(2) వర్తించదు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవే. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదు చేసిన కేసులను కొట్టివేయండి.’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళ్లు చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి..

ఎక్సైజ్‌లో రూ.3,113 కోట్లు దోచుకున్నారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 05 , 2025 | 07:21 AM