Share News

Gorantla: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బలప్రదర్శన..

ABN , Publish Date - Mar 05 , 2025 | 08:29 AM

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌ బుధవారం పోలీసుల విచారణకు రానున్నారు. ఈ క్రమంలో భారీగా జన సందోహంతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. గోరంట్లపై మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Gorantla:  మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బలప్రదర్శన..
Gorantla Madhav

అనంతపురం: వైసీపీ నేత (YCP Leader), హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Ex MP Gorantla Madhav) బలప్రదర్శనకు దిగారు. పోక్సో కేసు (Case)లో బాధితురాలి పేరు ప్రస్తావించడంపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ (Cyber ​​Crime Police Station)లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) ఫిర్యాదు చేశారు. దీంతో గోరంట్ల మాధవ్‌పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈరోజు విచారణకు హాజరయ్యేందుకు గోరంట్ల మాధవ్ భారీగా జన సందోహంతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే సెక్షన్ 35/3 బిఎన్ఎస్ఎస్ కింద గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Read More..:

పోసానిపై మరో కేసు..14 రోజుల రిమాండ్..


గోరంట్ల మాధవ్ సరికొత్త డ్రామా

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సరికొత్త డ్రామాకు తెరతీశాడు. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. విజయవాడకు ఇంకా బయలుదేరలేదు. అనంతపురం నుంచి విజయవాడకు తొమ్మిది గంటల ప్రయాణం పడుతుంది. అయినా అనంతపురంలోనే ఉంటూ టైం పాస్ చేస్తున్నాడు. పైకి మాత్రం విచారణకు వెళ్తున్నానంటూ పోలీసులను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులో ఉదయం పది గంటలకు హాజరుకావాలంటూ స్పష్టంగా పోలీసులు పేర్కొన్నారు. పది గంటలు అవుతున్నా ఇంకా గోరంట్ల మాధవ్ అనంతపురంలోని తన ఇంటి వద్ద ఉన్నాడు.

కాగా వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోక్సో కేసులో బాధితుల వివరాలను మీడియా సమావేశంలో ఆయన బహిరంగంగా వెల్లడించారంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ గత ఏడాది నవంబరు 2న ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్‌పై విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు బీఎన్‌ఎస్‌ 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయవాడ నుంచి వారు అనంతపురం వచ్చి మాధవ్‌ నివాసానికి వెళ్లారు. ఈ కేసులో మార్చి 5న విజయవాడలో విచారణకు రావాలని సూచించారు. విజయవాడ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారని, అరెస్టు చేయబోతున్నారని ప్రచారం జరగడంతో మాధవ్‌ అనుచరులు, వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చి వెళ్లిపోయారు.


కాగా.. పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న మాధవ్‌ మీడియాపై నోటి దురుసు ప్రదర్శించారు. ‘పోలీసు ఆఫీసర్‌గా పనిచేశారు కదా.. పోక్సో కేసులో బాధితుల పేర్లు బయటకు చెప్పకూడదనే విషయం తెలియదా..’ అని విలేకరులు ప్రశ్నించడంతో ఆయన వారిపై ఆవేశంతో ఊగిపోయారు. ‘మీది ఏ టీవీ.. ఏ మీడియా.. ఏ పత్రిక..’ అంటూ చిందులు వేశారు. తర్వాత నోటీసులపై స్పందిస్తూ... తన న్యాయవాదులతో చర్చించి.. మార్చి 5న విచారణకు వెళ్లాలో లేదో నిర్ణయించుకుంటానని తెలిపారు. ఆ రోజు తనకెలాంటి కార్యక్రమాలూ లేకపోతే విచారణకు హాజరవుతానని, లేదంటే గడువు కోరతానని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళ్లు చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి..

రాష్ట్రాన్ని దివాలా తీయించిన వైసీపీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 05 , 2025 | 09:58 AM