ENG vs WI: ఇంగ్లండ్ ఘోర పరాజయం.. ఇంత చిత్తుగా ఓడారేంటి
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:33 AM
ఇంగ్లీష్ టీమ్‌ను తాజాగా వెస్టిండీస్ దెబ్బ కొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ సంచలన విజయం సాధించింది. లియామ్ లివింగ్‌స్టన్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ లాంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను ఆతిథ్య జట్టు చావుదెబ్బ తీసింది.
ప్రస్తుత క్రికెట్‌లో టాప్ టీమ్స్‌లో ఒకటైన ఇంగ్లండ్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓడి నిరాశలో ఉన్న ఇంగ్లీష్ టీమ్‌ను తాజాగా వెస్టిండీస్ దెబ్బ కొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ సంచలన విజయం సాధించింది. లియామ్ లివింగ్‌స్టన్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ లాంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను ఆతిథ్య జట్టు చావుదెబ్బ తీసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
209 పరుగులకు ఆలౌట్
మొదటి వన్డేలో టాస్ నెగ్గిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. కెప్టెన్ షై హోప్ నిర్ణయం సరైనదేనని ఆ జట్టు బౌలర్లు నిరూపించారు. పేసర్లు మాథ్యూ ఫోర్డ్ (2/48), జేడెన్ సీల్స్ (2/22), అల్జారీ జోసెఫ్ (2/46) చెలరేగి బౌలింగ్ చేశారు. వీళ్ల దెబ్బకు 93 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్. ఆ తర్వాత సారథి లివింగ్‌స్టన్ (48), సామ్ కర్రన్ (37) కాసేపు పోరాడారు. కానీ స్పిన్నర్ గుడకేష్ మోతీ (4/41) ఎంట్రీతో సీన్ పూర్తిగా మారిపోయింది. వరుసగా వికెట్లు తీస్తూ పోయాడతను. లివింగ్‌స్టన్, కర్రన్‌తో పాటు మోస్లీ, ఓవర్టన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. విండీస్ బౌలర్ల దెబ్బకు పర్యాటక జట్టు 45.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది.
దూకుడుగా ఆడిన ఇంగ్లండ్
కష్టసాధ్యం కాని లక్ష్యంతో ఛేజింగ్ స్టార్ట్ చేసిన వెస్టిండీస్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చింది. బ్రెండన్ కింగ్ (30) అండతో చెలరేగిపోయాడు ఎవిన్ లూయిస్ (69 బంతుల్లో 94). వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ లైన్ దాటిస్తూ పోయాడు. 5 ఫోర్లు, 8 భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ తర్వాత ఇద్దరు ఓపెనర్లు స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా.. కీసీ కార్ట్‌లీ (19 నాటౌట్), కెప్టెన్ హోప్ (6 నాటౌట్) మిగిలిన పనిని పూర్తి చేశారు. కాగా, ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచిన స్పిన్నర్ మోతీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇది కూడా చదవండి:
Virat Kohli: నా నెక్స్ట్ గోల్ అదే.. దాని కోసమే పోరాటం: కోహ్లీ
India vs New Zealand: మొదలైన ముంబై టెస్ట్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
Updated Date - Nov 01 , 2024 | 11:33 AM