Indian hockey team : ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ABN , Publish Date - Aug 03 , 2024 | 06:11 AM
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుత ప్రదర్శనతో భారత హాకీ జట్టు తమ చివరి పూల్ ‘బి’ మ్యాచ్‌లో అదరగొట్టింది. 1972 ఒలింపిక్స్ తర్వాత..
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుత ప్రదర్శనతో భారత హాకీ జట్టు తమ చివరి పూల్ ‘బి’ మ్యాచ్‌లో అదరగొట్టింది. 1972 ఒలింపిక్స్ తర్వాత.. అంటే 52 ఏళ్ల అనంతరం తొలిసారిగా ఆస్ట్రేలియాపై 3-2తో గెలిచింది. టోక్యో గేమ్స్‌లో రజతం సాధించిన ఆసీస్‌పై ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్‌తో భారత్ ఆధిక్యం చూపించింది. అభిషేక్ (12వ నిమిషంలో), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (13వ, 33వ) భారత్‌కు గోల్స్ అందించారు. బెల్జియం టేబుల్ టాపర్‌గా ఉండగా, 9 పాయింట్లతో ఉన్న భారత్ రెండో స్థానంతో గ్రూప్ దశను ముగించే చాన్స్ ఉంది. ఈ పూల్ నుంచి ఇప్పటికే భారత్, బెల్జియం, ఆస్ట్రేలియా క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్‌లో భారత్‌కు జర్మనీ లేదా బ్రిటన్ ఎదురయ్యే అవకాశం ఉంది.