CSK VS MI: రాణించిన గైక్వాడ్, శివమ్ దూబే.. చివరిలో దుమ్మురేపిన ధోనీ
ABN, Publish Date - Apr 14 , 2024 | 09:31 PM
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, స్టార్ బ్యాటర్ శివమ్ దూబే అద్భుతంగా రాణించడం, చివరిలో ఎంఎస్ ధోనీ మెరుపులు మెరిపించడంతో ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి చెన్నై స్కోరు 206 పరుగులుగా నమోదయింది.
ముంబై: కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, స్టార్ బ్యాటర్ శివమ్ దూబే అద్భుతంగా రాణించడం, చివరిలో ఎంఎస్ ధోనీ మెరుపులు మెరిపించడంతో ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి చెన్నై స్కోరు 206 పరుగులుగా నమోదయింది. తొలి 10 ఓవర్లలో చెన్నై స్కోరు తక్కువగా ఉన్నప్పటికీ గైక్వాడ్, దూబే సిక్సర్లు, ఫోర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు.
ఓపెనర్ అజింక్యా రహానే (5), రచిన్ రవీంద్ర (21), రుతురాజ్ గైక్వాడ్ (69), శివమ్ దూబే (66 నాటౌట్), డారిల్ మిచెల్ (17), ఎంఎస్ ధోనీ (20 నాటౌట్) చొప్పున పరుగులు కొట్టారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కీలకమైన 2 వికెట్లు తీశాడు. వికెట్లు తీసినపప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 3 ఓవర్లు వేసి ఏకంగా 43 పరుగులు ఇచ్చాడు. గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయాస్ గోపాల్ చెరో వికెట్ తీశారు. మహ్మద్ నబీ, జస్ర్పీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయారు.
Updated Date - Apr 14 , 2024 | 09:39 PM