Cricket: టీమిండియా కొత్త కోచ్.. కెప్టెన్‌పై జైషా సంచలన ప్రకటన..
ABN, Publish Date - Jul 01 , 2024 | 11:03 AM
టీ20 ప్రపంచకప్ 2024 ముగిసింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తైంది. మరోవైపు రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో భారత పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌తో పాటు టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.
టీ20 ప్రపంచకప్ 2024 ముగిసింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తైంది. మరోవైపు రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో భారత పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌తో పాటు టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఈరెండు పోస్టులకు సంబంధించి బీసీసీఐ సెక్రటరీ జైషా కీలక ప్రకటన చేశాడు. ప్రస్తుతం తుపాను కారణంగా టీమిండియాతో పాటు జై షా బార్బడోస్‌లో చిక్కుకుపోయారు. అయితే జైషా ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. బీసీసీఐ కొత్త కోచ్‌ని ఎంపిక చేసిందని.. ఎవరనేది త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.
జట్టుకు కొత్త కోచ్, కెప్టెన్‌పై..
టీమ్ ఇండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇటీవల ఇంటర్వ్యూ నిర్వహించి.. ఇద్దరు పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిందని జైషా వెల్లడించారు. ప్రస్తుతానికి హెడ్ కోచ్ పేరును వెల్లడించలేదని.. శ్రీలంక పర్యటనకు జట్టుతో కొత్త కోచ్ ఉంటారని జైషా తెలిపారు. జింబాబ్వే టూర్‌లో వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను నియమించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. కోచ్ ఇంటర్వ్యూకు గంభీర్ హాజరయ్యారు. అయితే గంభీర్‌కు కోచ్ ఛాన్స్ లభిస్తుందా.. అనూహ్యంగా మరొకరి పేరును ప్రకటిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది.మొత్తానికి టీమిండియా కొత్త కోచ్ ఎవరనేది భారత జట్టు శ్రీలంక పర్యటనలో తెలియనుంది.
టీ20 ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్ పదవి ఖాళీ అయింది. దీనికి సంబంధించి జైషా మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఎవరి పేరు ఖరారు చేయలేదని.. టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికపై సెలక్టర్లు సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Sports News and Latest Telugu News
Updated Date - Jul 01 , 2024 | 11:14 AM