Rinku Singh: బ్యాటే కాదు బాల్‌తో ఇరగదీశాడు..
ABN, Publish Date - Jul 31 , 2024 | 11:39 AM
శ్రీలంకతో జరిగిన చివరి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో సూర్యకుమార్ సేన జయకేతనం ఎగరవేసింది. నిన్నటి మ్యాచ్‌లో రెండు హైలెట్స్ ఉన్నాయి. ఒకటి బంతితో సూర్యకుమార్ రాణించడం.. మరొకటి రింకూ సింగ్ కూడా బాల్‌తో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ వికెట్లు తీయడంతో కోచ్ గంభీర్ మొహం వెలగిపోయింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
శ్రీలంకతో జరిగిన చివరి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా (Team India) విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో సూర్యకుమార్ సేన జయకేతనం ఎగరవేసింది. నిన్నటి మ్యాచ్‌లో రెండు హైలెట్స్ ఉన్నాయి. ఒకటి బంతితో సూర్యకుమార్ రాణించడం.. మరొకటి రింకూ సింగ్ కూడా బాల్‌తో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ వికెట్లు తీయడంతో కోచ్ గంభీర్ మొహం వెలగిపోయింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
కీలకంగా మారిన 19వ ఓవర్
చివరి టీ 20లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 137 పరుగులు చేసింది. 138 పరుగుల లక్ష్యంతో శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. తొలి నుంచి ఫ్లేయర్స్ ధాటిగా ఆడుతున్నారు. 19వ ఓవర్‌ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రింకూ సింగ్‌కు ఇచ్చాడు. స్కై తనపై ఉంచిన నమ్మకాన్ని రింకూ సింగ్ వమ్ము చేయలేదు. చివరి రెండు ఓవర్లలో 9 పరుగులు కావాలి. ఫస్ట్ బాల్‌ను పెరెరా స్ట్రెయిట్‌గా ఆడాడు. రెండో బంతిని పైకి లేపాడు. రింకూ సింగ్ ఛాన్స్ తీసుకోలేదు. చక్కగా క్యాచ్ పట్టేశాడు. ఆ సమయంలో కెమెరా గంభీర్ వైపు తిప్పారు. ఇంకేముంది నవ్వుతూ కనిపించాడు. 19వ ఓవర్ చివరి బంతికి రమేష్ మెండిస్‌ను రింకూ సింగ్ ఔట్ చేశాడు. అలా ఓకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు.
స్కై విజృంభణ
రింకూ సింగ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్ బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు తీసి ఆ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. సూపర్ ఓవర్‌లో శ్రీలంక 2 వికెట్లు కోల్పోయింది. కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. ఆ వెంటనే ఓపెనర్‌గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి బంతిని బౌండరికి పంపించాడు. అలా టీమిండియా మూడో టీ 20 గెలిచి, సిరీస్ కైవసం చేసుకుంది. లంక జట్టును క్లీన్ స్వీప్ చేసింది.
Updated Date - Jul 31 , 2024 | 11:40 AM