Hyderabad: ఒక్కో డివిజన్‌కు రూ.2 లక్షల క్రీడా సామగ్రి
ABN, Publish Date - Oct 16 , 2024 | 09:36 AM
మహానగరంలో క్రీడా సదుపాయాల మెరుగుదలపై జీహెచ్‌ఎంసీ(GHMC) దృష్టి సారించింది. ఆసక్తి ఉన్న వారి కోసం అవసరమైన క్రీడా సామగ్రిని ప్లే గ్రౌండ్‌లు, ఇండోర్ స్టేడియంలలో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
- రూ.3 కోట్లతో ప్రతిపాదనలు
- రేపు స్టాండింగ్ కమిటీలో చర్చ
హైదరాబాద్ సిటీ: మహానగరంలో క్రీడా సదుపాయాల మెరుగుదలపై జీహెచ్‌ఎంసీ(GHMC) దృష్టి సారించింది. ఆసక్తి ఉన్న వారి కోసం అవసరమైన క్రీడా సామగ్రిని ప్లే గ్రౌండ్‌లు, ఇండోర్ స్టేడియంలలో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. కార్పొరేటర్ల విజ్ఞప్తి మేరకు డివిజన్‌కు రూ.2 లక్షల విలువైన క్రీడా సామగ్రిని మంజూరు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై రేపు జరగనున్న స్టాండింగ్ కమిటీలో చర్చించనున్నారు. ఒక్కో డివిజన్‌కు రూ.2 లక్షల చొప్పున 150 డివిజన్లలో రూ.3 కోట్ల విలువైన క్రీడా సామగ్రిని జీహెచ్‌ఎంసీ అందుబాటులో ఉంచనుంది. స్థానిక కార్పొరేటర్లు 11 క్రీడలకు సంబంధించిన సామగ్రిని యువజన సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, క్రీడలపై ఆసక్తి ఉన్న వారికి అందజేయనున్నారు. గతంలోనూ డివిజన్‌కు రూ.2 లక్షల విలువైన క్రీడా సామగ్రిని కార్పొరేటర్ల ద్వారా జీహెచ్‌ఎంసీ ఔత్సాహికులకు అందజేసింది.
ఈ వార్తను కూడా చదవండి: Instagram: ఇదోరకం మోసం.. లైక్ కొట్టు.. డబ్బు పట్టు
గతంలో అవకతవకలు
వాస్తవంగా జీహెచ్‌ఎంసీలో తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏటా కార్పొరేటర్ల ద్వారా క్రీడా సామగ్రి పంపిణీ జరిగేది. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు గతంలో గుర్తించారు. అధికారులు, కొందరు కార్పొరేటర్లు క్రీడా సామగ్రిని పూర్తిస్థాయిలో పంపిణీ చేయకుండా చేసినట్టు చూపారని తేల్చారు. మెటీరియల్ సరఫరా చేయకుండానే పలు సంస్థలకు బిల్లుల చెల్లింపులు జరిగాయని గుర్తించారు. దీంతో క్రీడా సామగ్రి పంపిణీని నిలిపివేసి.. జీహెచ్‌ఎంసీకి చెందిన ప్లే గ్రౌండ్‌లు, ఇండోర్ స్టేడియంలలో అందుబాటులో ఉంచడం ప్రారంభించారు. గత సర్కారు హయాంలోనే కార్పొరేటర్ల విజ్ఞప్తి మేరకు స్పోర్ట్స్ మెటిరీయల్ పంపిణీ జరిగింది. మరోసారి కార్పొరేటర్ల ద్వారా క్రీడా సామగ్రినిఅందజేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈ క్రీడలకే..
- క్రికెట్ ఫ షటిల్
- బ్యాడ్మింటన్ ఫ టెన్నిస్ ఫ క్యారమ్ ఫ స్కేటింగ్
- చెస్ ఫ బాస్కెట్ బాల్
- వాలీబాల్ ఫ ఫుట్‌బాల్
- టెన్నికాయిట్
- టేబుల్ టెన్నిస్
ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్!
ఇదికూడా చదవండి: KTR: విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సర్కార్
ఇదికూడా చదవండి: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు
ఇదికూడా చదవండి: Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 16 , 2024 | 09:36 AM