ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ICC T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024.. కెనడాను ఓడించిన అమెరికా

ABN, Publish Date - Jun 02 , 2024 | 11:52 AM

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 అమెరికా, కెనడా మధ్య గ్రూప్ ఏ మ్యాచ్‌తో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సహ ఆతిథ్య అమెరికా జట్టు ఏడు వికెట్ల తేడాతో కెనడాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కెనడా బ్యాట్స్‌మెన్ తమ సత్తా చాటగా బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

icc t20 world cup 2024 United States beat Canada

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024(ICC T20 World Cup 2024) అమెరికా, కెనడా మధ్య(USA vs CAN match) గ్రూప్ ఏ మ్యాచ్‌ అట్టహాసంగా ప్రారంభం కాగా.. ఈ మ్యాచ్‌లో సహ ఆతిథ్య అమెరికా జట్టు ఏడు వికెట్ల తేడాతో కెనడాను సులభంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో కెనడా బ్యాట్స్‌మెన్స్ తమ సత్తా చాటగా బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అమెరికా మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

అది పూర్తిగా వారికి అనుకూలంగా మారిందని చెప్పవచ్చు. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఆరోన్ జోన్స్ అమెరికా తరఫున అతిపెద్ద ఇన్నింగ్స్‌ను ఆడి 40 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. ఇది కాకుండా ఆండ్రీస్ గస్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 131 పరుగుల (58 బంతులు) అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించి జట్టు విజయానికి తోడ్పాటునందించారు.


డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నవనీత్ ధలీవాల్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి జట్టుకు అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన అమెరికా మూడు వికెట్ల నష్టానికి 17.4 ఓవర్లలోనే విజయాన్ని నమోదు చేసింది. కెనడా తరఫున కలీమ్ సనా, డైలాన్ హెలిగర్, నిఖిల్ దత్తా తలో వికెట్ తీశారు. మరోవైపు అమెరికా తరఫున అలీఖాన్, హర్మీత్ సింగ్, కోరీ అండర్సన్ చెరో వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి..

T20 World Cup : వచ్చేసింది క్రికెట్ తుఫాన్!


Viral Video: ఇదేం ఖర్మరా బాబూ.. నడిరోడ్డు మీద వింత స్టంట్లు ఎందుకోసమో తెలిస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 02 , 2024 | 11:52 AM

Advertising
Advertising