ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పీఎస్‌ఎల్ ఫైనల్ మ్యాచ్ సమయంలో కీలక ఆటగాడి స్మోకింగ్

ABN, Publish Date - Mar 19 , 2024 | 03:18 PM

ఇటివల పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఫైనల్ 2024 మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా డ్రెస్సింగ్ రూమ్‌(dressing room)లోనే మాజీ పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వాసిమ్(Imad Wasim) సిగరెట్ తాగుతూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇటివల పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL 2024) ఫైనల్ 2024 మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా డ్రెస్సింగ్ రూమ్‌(dressing room)లోనే మాజీ పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వాసిమ్(Imad Wasim) సిగరెట్ తాగుతూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఇమాద్ ధూమపానం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ వీడియో చూసిన నెటిజన్లు సోషల్ మీడియా(social media)లో వీడియోను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

ఈ సంఘటన సోమవారం రాత్రి యునైటెడ్ కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ముల్తాన్ సుల్తాన్స్(Multan Sultans) vs ఇస్లామాబాద్ యునైటెడ్(Islamabad United) మధ్య జరిగిన క్రమంలో చోటుచేసుకుంది. ఈ సీజన్ 9 టైటిల్ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ రెండు వికెట్ల తేడాతో ముల్తాన్ సుల్తాన్‌లను ఓడించి మూడోసారి PSL టైటిల్‌ను కైవసం చేసుకుంది.


ఇస్లామాబాద్ యునైటెడ్(Islamabad United) తరఫున 35 ఏళ్ల ఆల్ రౌండర్ ఇమాద్(Imad Wasim) బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతోపాటు బ్యాటింగ్ కూడా చేసి 19 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ను ఆడి ఇస్లామాబాద్ యునైటెడ్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసినందుకు అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో అతను స్మోకింగ్ చేస్తూ పట్టుబడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Elon Musk: డ్రగ్స్ వాడకం గురించి ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Updated Date - Mar 19 , 2024 | 03:18 PM

Advertising
Advertising