IND vs NZ: దురదృష్టం అంటే నీదే భయ్యా.. రోహిత్ ఔట్ పై ఫ్యాన్స్ రెస్పాన్స్
ABN, Publish Date - Oct 18 , 2024 | 06:34 PM
న్యూజిలాండ్ తో టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మకు అడుగడుగునా పరీక్షపెడుతోంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్ లో రాణించలేకపోయిన టీమిండియాకు రెండో ఇన్నింగ్స్ ఆరంభం కాస్త ఊరటనిచ్చింది. అయితే, ఊహించని రీతిలో రోహిత్ శర్మ అవుట్ అవ్వడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
బెంగళూరు, అక్టోబర్ 18: న్యూజిలాండ్ తో టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మకు అడుగడుగునా పరీక్షపెడుతోంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్ లో రాణించలేకపోయిన టీమిండియాకు రెండో ఇన్నింగ్స్ ఆరంభం కాస్త ఊరటనిచ్చింది. అయితే, ఊహించని రీతిలో రోహిత్ శర్మ అవుట్ అవ్వడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండో ఇన్నింగ్స్ 22వ ఓవర్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ వేసిన బంతిని రోహిత్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అనూహ్యంగా బంతి బ్యాట్ ను తాకి బౌన్స్ అయ్యి వికెట్లను తాకింది. దీంతో స్టంప్స్ ఎగిరిపడ్డాయి. ఈ పరిణామం రోహిత్ శర్మను షాక్ కు గురిచేసింది.
దీంతో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ ఇలా ఎలా ఔటయ్యానంటూ రోహిత్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నెట్టింట వైరలవుతోంది. పెవిలియన్ నుంచి నిరాశగా వెనుదిరుగుతున్న రోహిత్ వీడియోపై కమెంట్ల వర్షం కురుస్తోంది. ఇది చూసిన అతడి ఫ్యాన్స్ సైతం అతడిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ‘నువ్వు నిజంగా అన్ లక్కీ రోహిత్ భాయ్’ అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఏదేమైనా రోహిత్ శర్మ ఇంకాస్త అలెర్ట్ గా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ లోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపైనా రోహిత్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read:
వెంకన్న భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్
టెస్ట్ క్రికెట్లో విరాట్ మరో రికార్డ్..
For More Sports News and Telugu News..
Updated Date - Oct 18 , 2024 | 06:34 PM