T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ABN, Publish Date - Jun 29 , 2024 | 10:12 AM
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ రెండోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా.. మొదటిసారి కప్ గెల్చుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టిస్తుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ రెండోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా.. మొదటిసారి కప్ గెల్చుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టిస్తుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయవకాశాలపై టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కాలంలో భారత్ మూడు ఐసీసీ ఫైనల్స్‌కు చేరుకుందన్నారు. గతంలో పోలిస్తే భారత ఆటగాళ్లు ఎంతో నిలకడగా ఆడుతున్నారన్నారు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్‌లో భారత్ తడబడిందని.. ఈసారి ఆవిధంగా జరిగే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచకప్‌లో భారత్ అత్యంత ఉన్నతమైన జట్టుగా ఉందన్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ప్రపంచ టైటిల్ గెలవాలనే లక్ష్యం ప్రస్తుత టీమ్‌లో కనిపిస్తోందన్నారు. టైటిల్ గెలవాలనే ఆశతో రోహిత్ సేన దక్షిణాఫ్రికాతో తలపడనున్నట్లు తెలిపారు.
India vs South Africa: ఫైనల్ మ్యాచ్‌కి ముందు.. భారత్ షాకింగ్ నిర్ణయం
నిలకడగా ఆడుతున్నాం..
ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా నిలకడగా ఆడుతూ వచ్చింది. మూడు ప్రపంచస్థాయి టోర్నమెంట్లలో ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. ఫైనల్స్ మ్యాచ్‌లో సమిష్టిగా ఆడి.. చిన్న చిన్న పొరపాట్లు చేయకపోతే తప్పకుండా టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంటామని ద్రవిడ్ తెలిపారు. మరోవైపు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. వచ్చే నెలలో భారత్‌కు కొత్త కోచ్ వచ్చే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్ కొత్త కోచ్‌గా వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... కప్ గెలుస్తామని మేమంతా విశ్వాసంతో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతారని చెప్పారు.
సెమీఫైనల్స్ ఆడిన ఒకరోజు వ్యవధిలోనే ఫైనల్ మ్యాచ్ ఆడటం వలన మానసికంగా ఫైనల్ మ్యాచ్‌కు టీమ్ సిద్ధంగా ఉందన్నారు. ఇంగ్లండ్‌తో గయానాలో సెమీఫైనల్ ముగిసిన వెంటనే జట్టు బార్బడోస్‌కు వెళ్లిందని.. దక్షిణాఫ్రికాతో జరిగే ఈ మ్యాచ్‌కు భారత్ మానసికంగా సిద్ధంగా ఉందని ద్రవిడ్ చెప్పారు. ఒకరోజు మాత్రమే సెమీఫైనల్స్‌కు, ఫైనల్స్‌కు మధ్య గ్యాప్ దొరికిందని.. దీంతో ఎక్కువుగా ప్రాక్టీస్ చేసే అవకాశం లేదన్నారు. భౌతికంగా, మానసికంగా, వ్యూహాత్మకంగా ఆటగాళ్లను ఫైనల్స్‌కు సిద్ధం చేశామన్నారు. గతంలో ఈపిచ్‌పై భారత్ భారీ స్కోర్ చేసిందని, ఈసారి కూడా భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈపిచ్‌పై ఆడి గెలిచిన అనుభవం భారత్‌కు ఉందని ద్రవిడ్ తెలిపారు.
T20 World Cup final : ఈసారి వదలొద్దు!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Sports News and Latest Telugu News
Updated Date - Jun 29 , 2024 | 10:12 AM