ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

India vs Afghanistan: నేడు ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ABN, Publish Date - Jun 20 , 2024 | 10:02 AM

నేడు టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత జట్టు(team india) ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)తో సూపర్ 8 ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచుల్లో గెలిచి సూపర్ 8కి చేరుకుంది. ఈ క్రమంలో ఈరోజు బార్బడోస్‌(Barbados)లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.

india vs afghanistan super 8 43rd match

నేడు టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత జట్టు(team india) ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)తో సూపర్ 8 ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచుల్లో గెలిచి సూపర్ 8కి చేరుకుంది. ఈ టీం న్యూజిలాండ్ వంటి జట్టును కేవలం 75 పరుగులకే ఆలౌట్ చేసి 84 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఆప్ఘాన్ జట్టును తక్కువగా అంచనా వేయలేము. ఈ నేపథ్యంలో టీమిండియా కూడా ఈ మ్యాచులో గెలిచి తీరాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంటుంది.


ఈరోజు బార్బడోస్‌(Barbados)లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను ఆడుతున్న భారత జట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు అమెరికాలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు సూపర్ 8లో టీమిండియా వెస్టిండీస్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే టీమిండియా 80 శాతం గెలిచే అవకాశం ఉండగా, ఆప్ఘానిస్తాన్ జట్టుకు 20 శాతం ఉంది.


భారత్(team india) జట్టులో ఆడనున్న 11 మందిలో రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.

ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) జట్టులో ఆడనున్న 11 మందిలో రహ్మానుల్లా గుర్బాజ్ (WK), ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ కలరు.


ఇది కూడా చదవండి:

కోహ్లీ ఇక్కడైనా కొడతాడా?

Spurious Liquor: కల్తీ మద్యం తాగి 25 మంది మృతి, మరో 60 మందికి అనారోగ్యం..సీఎం స్పందన


Read Latest Cricket News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 10:07 AM

Advertising
Advertising