Share News

Rahul Dravid: ఎక్కడ కోల్పోయాడో అక్కడే సాధించిన ద్రవిడ్.. 16 ఏళ్ల క్రితం విండీస్‌లో ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jun 30 , 2024 | 11:58 AM

టీమిండియా తరఫున దాదాపు 15 ఏళ్ల పాటు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ కెరీర్లో చేదు జ్ఞాపకం 2007 ప్రపంచకప్. వెస్టిండీస్‌లో జరిగిన ఆ ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది.

Rahul Dravid: ఎక్కడ కోల్పోయాడో అక్కడే సాధించిన ద్రవిడ్.. 16 ఏళ్ల క్రితం విండీస్‌లో ఏం జరిగిందంటే..
Rahul Dravid

టీమిండియా (Teamindia) తరఫున దాదాపు 15 ఏళ్ల పాటు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కెరీర్లో చేదు జ్ఞాపకం 2007 ప్రపంచకప్ (2007 Worldcup). వెస్టిండీస్‌లో జరిగిన ఆ ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది. బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోయి దారుణ అవమానాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ ఎంతో కాలం కెప్టెన్‌గా ఉండలేకపోయాడు. ఎం‌ఎస్ ధోనీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. కొద్ది కాలానికే రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. (T20 Worldcup)


వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్ రాహుల్ ద్రవిడ్ కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. అయితే దాదాపు 16 ఏళ్ల తర్వాత ద్రవిడ్ మార్గనిర్దేశకత్వంలో వెస్టిండీస్‌లోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ సాధించడం విశేషం. ఈ విజయంతో ద్రవిడ్ ఉప్పొంగిపోయాడు. విజయం అనంతరం మైదానంలోకి వచ్చి సంతోష సంబరాలు చేసుకున్నాడు (Rahul Dravid Celebrations). చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టాడు. ప్రపంచకప్ పట్టుకుని మురిసిపోయాడు. ఈ ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగియబోతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్నాడు.


2021 నవంబర్‌లో ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత జరిగిన 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. ఇలా అన్నింట్లోనూ పరాజయాలే పలకరించాయి. అయినా ద్రవిడ్ ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. జట్టు అంతటినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చి 2023 వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధం చేశాడు. ఆ టోర్నీలో అద్భుతంగా రాణించిన టీమిండియా ఒక్క ఫైనల్ మ్యాచ్‌లో మాత్రమే తడబడి టైటిల్ కోల్పోయింది. అయినా నిరాశ దరి చేరనీయకుండా పట్టుదలగా పని చేసి టీమిండియాను పొట్టి క్రికెట్లో విశ్వ విజేతగా నిలిపాడు.

ఇవి కూాడా చదవండి..

T20 Worldcup: మ్యాచ్ అనంతరం దిగ్గజాల భావోద్వేగం.. రోహిత్, విరాట్ సంతోషం చూశారా?


T20 Worldcup: 16 సంవత్సరాల 9 నెలల 5 రోజులు.. టీమిండియా విజయంపై ఢిల్లీ, యూపీ పోలీసుల వినూత్న ట్వీట్లు!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 30 , 2024 | 11:58 AM