Share News

Kaviya Maran: సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆమె గురించి ఈ విషయాలు తెలిస్తే..

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:24 PM

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు ఎంత ఫేమస్సో.. అంతకు మించి కావ్య మారన్ ఫేమస్. హైదరాబాద్ మ్యాచ్ ఆడుతోందంటే చాలు.. కెమెరాలన్నీ ఈమె వైపే తిరుగుతాయి.

Kaviya Maran: సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆమె గురించి ఈ విషయాలు తెలిస్తే..

కావ్య మారన్..! ఐపీఎల్‌ చూసే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఐపీఎల్‌ (IPL 2024)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎంత ఫేమస్సో.. అంతకు మించి కావ్య మారన్ (Kaviya Maran) ఫేమస్. హైదరాబాద్ మ్యాచ్ ఆడుతోందంటే చాలు.. కెమెరాలన్నీ ఈమె వైపే తిరుగుతాయి. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ను క్యాప్చర్ చేసేందుకు పోటీ పడతాయి! సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు కొడితే కావ్య మురిసిపోతుంది. వికెట్లు తీస్తే సంబరాలు చేసుకుంటుంది. అలాగే హైదరాబాద్ ప్లేయర్లు ఫెయిల్ అయితే డిసప్పాయింట్ అవుతుంది (IPL 2024).

ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు సంబంధించిన అని వ్యహారాలను కావ్య మారన్ స్వయంగా చూసుకుంటుంది. వేలం నుంచి జట్టు వ్యూహాల వరకు.. ఫ్రాంచైజీ సహ యజమానిగా అన్ని బాధ్యతలను పర్యవేక్షిస్తుంటుంది. 2018 నుంచి ఎస్‌ఆర్‌హెచ్ సీఈవోగా వ్యవహరిస్తోంది. స్టేడయంలో సందడి చేస్తూ సెలెబ్రిటీలకు ఏమాత్రం తగ్గని రేంజులో ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. తమిళ బిజినెస్ టైకూన్, సన్‌ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ ఒక్కగానొక్క కూతురే ఈ కావ్య మారన్. కావ్య మారన్ 1992 ఏప్రిల్‌ ఆరున చెన్నైలో జన్మించింది. ఈమె తల్లి పేరు కావేరీ మారన్. సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్‌కు సీఈవోగా ఉన్నారు.

కావ్య మారన్ కామర్స్‌లో డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత యూకేలో ఎంబీఏ చదివింది. కళానిధి మారన్‌కు చెందిన దాదాపు రూ.33 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి కావ్యనే వారసురాలు. కొన్ని నివేదికల ప్రకారం కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.417 కోట్లు. సన్‌రైజర్స్‌తో పాటు, సన్‌ గ్రూప్ వ్యహారాలను కూడా కావ్య చూసుకుంటోంది. సౌతాఫ్రికా టీ-20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు వరుసగా రెండు సీజన్లలో విజయం సాధించింది. ఈస్ట్రన్ కేప్ జట్టు బాధ్యతలను కావ్య మారనే చూసుకుంటోంది.

గత మూడు సీజన్లుగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా వైఫల్యాలు చవిచూసింది. మూడు సీజన్లలోనూ అభిమానులను నిరాశపరిచింది. 2021,22లో పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. గత సీజన్‌లో చివరి స్థానానికి పరిమితం అయ్యింది. 2024లో అయినా హైదరాబాద్ టీమ్ మెరుగ్గా రాణించి కావ్య మొహంలో సంతోషం నింపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

Hardik Pandya: స్వంత మైదానంలో ముంబై కెప్టెన్‌ హార్దిక్‌కు అవమానం.. గేలి చేసిన అభిమానులు..!


MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..


Updated Date - Apr 02 , 2024 | 01:24 PM