ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: నేడు రాత్రి SRH Vs CSK మ్యాచ్.. ఫేవరెట్ ఎవరు, ప్రిడిక్షన్ ఎలా ఉంది?

ABN, Publish Date - Apr 28 , 2024 | 06:39 AM

నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో 46వ కీలక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. చెన్నై(Chennai)లోని MA చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఫేవరెట్, ఎవరు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

ipl 2024 46th match SRH Vs CSK win prediction

నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో 46వ కీలక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. చెన్నై(Chennai)లోని MA చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే చెన్నై జట్టు రెండు వరుస పరాజయాలను చవిచూసినందున ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. రెండు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే లక్నో సూపర్‌జెయింట్స్ చేతిలో ఓడిపోయింది.


మరోవైపు గత మ్యాచులో RCB చేతిలో ఓడిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తోంది. ఈ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది.


చెన్నై సూపర్ కింగ్స్(CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు 20 మ్యాచ్‌లు ఆడగా అందులో సీఎస్‌కే 14 మ్యాచ్‌లు, హైదరాబాద్ 6 మ్యాచ్‌లు గెలిచాయి. SRHపై చెన్నై అత్యధిక స్కోరు 223. కాగా CSKపై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 192. చివరిసారిగా 5 ఏప్రిల్ 2024న ఇరు జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 165/5 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడనున్నాయి.


ఇక ఈ మ్యాచులో గూగుల్ గెలుపు(google win probability) అంచనాలను చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచేందుకు 53 శాతం అవకాశం ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 47 శాతం ఛాన్స్ ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్రాబబుల్ 11లో రుతురాజ్ గైక్వాడ్ (C), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (WK), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతిషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్. ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ కలరు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కెండే, జయదేవ్ ఉనద్కత్. ఇంపాక్ట్ ప్లేయర్ టీ నటరాజన్ ఉన్నారు.


ఇది కూడా చదవండి:

రాజస్థాన్‌.. తగ్గేదేలె!


హంపి, హారిక, వైశాలి


Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 06:42 AM

Advertising
Advertising