ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: నేడు KKR vs SRH క్వాలిఫైయర్1 మ్యాచ్.. పిచ్ ఎలా ఉంది, వర్షం వచ్చే ఛాన్స్ ఉందా?

ABN, Publish Date - May 21 , 2024 | 10:52 AM

ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ప్రస్తుతం ప్లేఆఫ్ దశకు చేరుకుంది. ఈ క్రమంలో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్వాలిఫయర్1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH) జట్టుతో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు అహ్మదాబాద్‌లో వాతావరణం ఎలా ఉంది, వర్షం వచ్చే ఛాన్స్ ఉందా, పిచ్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ipl 2024 kkr vs srh qualifier 1 match weather report

ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ప్రస్తుతం ప్లేఆఫ్ దశకు చేరుకుంది. ఈ క్రమంలో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్వాలిఫయర్1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH) జట్టుతో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ తొలిసారి అగ్రస్థానంలో నిలవగా గ్రూప్ దశలో హైదరాబాద్ జట్టు కూడా అద్భుత ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే నేడు అహ్మదాబాద్‌లో వాతావరణం ఎలా ఉంది, వర్షం వచ్చే ఛాన్స్ ఉందా, పిచ్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఇప్పటికే మూడు మ్యాచులు

ప్రస్తుత సీజన్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా పూర్తిగా వాష్‌ అయ్యాయి. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా ఓవర్లను కుదించారు. ముంబై ఇండియన్స్, KKR మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించారు. కానీ మే 13న కోల్‌కతా గుజరాత్ మధ్య మ్యాచ్ రెయిన్ కారణంగా రద్దు చేయబడింది. దీంతోపాటు హైదరాబాద్, గుజరాత్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా వాష్ చేయబడింది. ఇదొక్కటే కాదు IPL 2024 గ్రూప్ దశలో KKR, రాజస్థాన్ మధ్య ఆదివారం గౌహతిలో జరగాల్సిన చివరి మ్యాచ్ కూడా రద్దైంది.


వర్షం ఉందా

హైదరాబాద్, కేకేఆర్ జట్ల మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈరోజు వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది. వాతావరణ శాఖ ప్రకారం అహ్మదాబాద్ వాతావరణం ఆహ్లాదకరంగా, ఎండగా ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో నేడు అభిమానులు KKR, హైదరాబాద్ థ్రిల్లింగ్ మ్యాచ్‌ని ఆస్వాదించవచ్చని వెదర్ రిపోర్ట్ అధికారులు తెలిపారు. అయితే తేమ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో కొంత మంచు ప్రభావం ఉంటుందని తెలిపారు.


మ్యాచ్ రద్దయితే ఎవరికి లాభం?

హైదరాబాద్, KKR మధ్య మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉండకపోవచ్చు. కానీ వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తే కోల్‌కతా జట్టు నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది. దీనికి కారణం ఏమిటంటే KKR జట్టు పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రెయిన్ కారణంగా ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయితే కేకేఆర్ జట్టు ప్రయోజనం పొందుతుంది.


ఇది కూడా చదవండి:

EPFO: మీరు ఏ వయస్సులో ముందస్తు పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు?


Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

Read latest Sports News and Telugu News

Updated Date - May 21 , 2024 | 10:54 AM

Advertising
Advertising