ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: నేడు RCB vs GT మ్యాచ్.. సొంత మైదానంలో గెలుస్తారా, పిచ్ ఎలా ఉంది?

ABN, Publish Date - May 04 , 2024 | 07:55 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 52వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans) జట్లు తలపడనున్నాయి. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

RCB vs GT 52nd match win prediction

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 52వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans) జట్లు తలపడనున్నాయి. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. RCB తమ చివరి రెండు గేమ్‌లలో అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా గెలవాలని చూస్తోంది. మరోవైపు గుజరాత్ జట్టు కూడా మళ్లీ విజయపథంలోకి రావాలని భావిస్తోంది. గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఆరు ఓటములతో ఎనిమిది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా, RCB 10 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి, 7 ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.


ఈరోజు వర్షం పడే అవకాశం తక్కువగా ఉంది. బెంగళూరు(Bengaluru)లో సాయంత్రం 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఆటగాళ్లు విపరీతమైన వేడిని ఎదుర్కొవాల్సిన అవసరం ఉండదు. చిన్నస్వామి మైదానం బ్యాట్స్‌మెన్లకు స్వర్గధామంగా పరిగణించబడుతుంది. చిన్న బౌండరీ కారణంగా ఈ మైదానంలో ఫోర్లు, సిక్సర్లు ఈజీగా వస్తాయి. ఇక్కడ స్పిన్ బౌలర్లకు కూడా పిచ్ నుంచి సపోర్ట్ లభిస్తుందని క్రీడా వర్గాలు అంటున్నాయి.

చిన్నస్వామి మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 88 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 37 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. అదే సమయంలో, పరుగుల వేటలో ఉన్న జట్లు 47 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అంటే ఈ మైదానంలో ఛేజింగ్ ఎక్కువ లాభదాయకమని చెప్పవచ్చు.


ఇక నేటి మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు 55 శాతం గెలిచే అవకాశం ఉండగా, గుజరాత్ టైటాన్స్‌(GT) జట్టుకు 45 శాతం ఛాన్స్ ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విల్ జాక్స్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్ (C), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్ కలరు.


ఇది కూడా చదవండి:

కోల్‌కతా కమాల్‌


పొవెల్‌కే పగ్గాలు


Read Latest Sports News and Telugu News

Updated Date - May 04 , 2024 | 08:16 AM

Advertising
Advertising