ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: నాడు వద్దనుకున్నోడే.. నేడు కీలకమయ్యాడు!

ABN, Publish Date - Apr 06 , 2024 | 12:15 PM

గత ఏడాది డిసెంబరు 19న జరిగిన ఐపీఎల్‌(IPL) వేలంలో ఛత్తీ్‌సగఢ్‌ క్రికెటర్‌ శశాంక్‌ సింగ్‌ను(Shashank Singh) పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) కొనుగోలు చేసిన సందర్భంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. శశాంక్‌ పేరుతో ఇద్దరు వేలంలో నిలిచారు. శశాంక్‌ను పీబీకేఎస్‌ సొంతం చేసుకున్నట్టు ఆక్షనీర్‌ మల్లికా ..

Shashank Singh

న్యూఢిల్లీ, ఏప్రిల్ 06: గత ఏడాది డిసెంబరు 19న జరిగిన ఐపీఎల్‌(IPL) వేలంలో ఛత్తీస్‌గఢ్‌ క్రికెటర్‌ శశాంక్‌ సింగ్‌ను(Shashank Singh) పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) కొనుగోలు చేసిన సందర్భంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. శశాంక్‌ పేరుతో ఇద్దరు వేలంలో నిలిచారు. శశాంక్‌ను పీబీకేఎస్‌ సొంతం చేసుకున్నట్టు ఆక్షనీర్‌ మల్లికా సాగర్‌ ప్రకటించింది. కానీ తాము కొనుగోలు చేసింది ఈ శశాంక్‌ను కాదని మరో శశాంక్‌నని ఫ్రాంచైజీ యజమానురాలు ప్రీతి జింతా, నెస్‌ వాడియా.. ఆక్షనీర్‌ మల్లికా సాగర్‌తో వాదించారు. వారి వాదనను మల్లిక తోసిపుచ్చడంతో ప్రీతి, వాడియా నిరాశ చెందినట్టు కనిపించారు.

ఇక..అన్‌క్యాప్డ్‌ ఆటగాడు శశాంక్‌ను తీసుకోవడం అస్సలు ఇష్టం లేదంటూ ఫ్రాంచైజీ ఓనర్లను ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. ఇక సీన్‌ కట్‌ చేస్తే..అదే శశాంక్‌ సింగ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి గుజరాత్‌పై పంజాబ్‌కు నమ్మశక్యంకాని విజయం అందించాడు. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా శశాంక్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ‘శశాంక్‌ మా జట్టుకు చాలా స్పెషల్‌. అతని పాజిటివ్‌ దృక్పథం, అంతులేని ఆత్మవిశ్వాసం ఎంతో నచ్చుతుంది. తనపై వచ్చిన వ్యాఖ్యలను, జోక్‌లను అతడు క్రీడా స్ఫూర్తితో తీసుకున్నాడు’ అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా శశాంక్‌తో దిగిన సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం..

Updated Date - Apr 06 , 2024 | 12:15 PM

Advertising
Advertising