Viral Video: చివరి బంతికి SRH విక్టరీ.. ఎగిరి గంతేసిన కావ్య మారన్
ABN, Publish Date - May 03 , 2024 | 07:50 AM
ఐపీఎల్ 2024(IPL 2024)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య నిన్న జరిగిన ఉత్కంఠ మ్యాచులో హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(kavya maran) ఆనందంతో ఎగిరి గంతేశారు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య నిన్న జరిగిన ఉత్కంఠ మ్యాచులో హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట రాజస్థాన్ ఈ మ్యాచ్‌ని సులువుగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. చివరి 18 బంతుల్లో గెలవడానికి 27 పరుగులే మిగిలి ఉన్నాయి. కానీ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. అంతలోనే ట్విస్ట్ నెలకొంది. ఓవర్ చివరి బంతికి రోమన్ పావెల్‌ను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయడంతో హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది.
భువనేశ్వర్ కుమార్(bhuvneshwar kumar) ఆఖరి ఓవర్ బౌలింగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిందని చెప్పవచ్చు. ఆ క్రమంలోనే లాస్ట్ బంతి విజయంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(kavya maran) ఆనందంతో ఎగిరి గంతేశారు. సంతోషంతో నవ్వుతూ కనిపించారు. వీడియోలో భువనేశ్వర్ కుమార్‌ను మిగతా ఆటగాళ్లు హత్తుకుని అభినందనలు తెలియజేయడం కనిపిస్తోంది. ఆ క్రమంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సన్‌రైజర్స్ హైదరాబాద్ జెండాలు ఊపుతూ సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతోంది.
ఇక SRH విజయం తర్వాత పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానానికి చేరుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో స్థానానికి దిగజారింది. మరోవైపు ఆర్ఆర్(RR) ఎనిమిది విజయాలు, రెండు ఓటములతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌కి ఇది రెండో ఓటమి కాగా, 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది ఆరో విజయం.
ఇది కూడా చదవండి:
నలుగురు స్పిన్నర్లు ఉండాల్సిందే
Heatwave: హీట్‌వేవ్ ఎఫెక్ట్..పెరుగుతున్న కూరగాయల ధరలు, ద్రవ్యోల్బణంపై కూడా
Read Latest Sports News and Telugu News
Updated Date - May 03 , 2024 | 08:16 AM