ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: LSGపై SRH గ్రాండ్ విక్టరీ.. రెండు జట్లకు గట్టి షాక్

ABN, Publish Date - May 09 , 2024 | 07:19 AM

నిన్న లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants) జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు గ్రాండ్ విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో టాప్ 3లోకి దూసుకెళ్లింది. SRH 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో లక్నో జట్టును ఓడించింది. దీంతో ఈ ప్రభావం రెండు జట్లపై పడింది.

SRH won by LSG A big shock for lsg and mi

నిన్న లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants) జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు గ్రాండ్ విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో టాప్ 3లోకి దూసుకెళ్లింది. SRH 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో లక్నో జట్టును ఓడించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ 58 బంతుల్లోనే ఛేదించి చరిత్ర సృష్టించారు. దీంతో LSG నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. మరోవైపు ఈ విజయంతో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఈ ఎడిషన్ నుంచి నాకౌట్ అయిన మొదటి జట్టుగా నిలిచింది.


ముంబై ఔట్

IPL 2024లో MI ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడింది, అందులో 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ముంబయి ఇండియన్స్ తన తదుపరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి. ఇక CSK, LSG, DC ప్రస్తుతం 12 పాయింట్లను కలిగి ఉన్నప్పటికీ, లక్నో సూపర్ జెయింట్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా ఒక మ్యాచ్ ఉంది. ఒకవేళ ఆ మ్యాచ్ రద్దయినా ఇరు జట్లకు చెరో 13 పాయింట్లు ఉంటాయి. ఒక జట్టు గెలిస్తే, అది 14 పాయింట్లకు చేరుకుంటుంది. కానీ ముంబైకి 13 లేదా 14 పాయింట్లు రావడం అసాధ్యం కాబట్టి, వారు ఇప్పుడు IPL 2024 సీజన్ ప్లే ఆఫ్ రేసు నుంచే కాదు పూర్తిగా ఈ సీజన్ నుంచి నిష్క్రమించారు.


ప్రస్తుతం ఐపీఎల్ 2024(ipl 2024) పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న కేకేఆర్, ఆర్‌ఆర్‌లు ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్నాయి. LSGపై భారీ విజయం తర్వాత, సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అంతేకాదు హైదరాబాద్ నెట్ రన్ రేట్ కారణంగా మైనస్ నుంచి +0.406 కి చేరింది. దీంతో ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న CSK ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది.


5 జట్లకు ప్లేఆఫ్‌ ఛాన్స్

ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్‌ నుంచి ఇప్పటికే ఔట్ అయిన ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. దీంతో ప్రస్తుతం 5 జట్లకు టాప్ 4కు చేరే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్రస్తుతం CSK లాగా 12 పాయింట్లను కలిగి ఉన్నాయి. కానీ ఢిల్లీ, లక్నోల నెట్ రన్ రేట్ చెన్నై కంటే తక్కువగా ఉంది. ఢిల్లీ, లక్నో ఇంకా 2-2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి టాప్ 4లోకి వచ్చేందుకు వారికి అవకాశాలు ఉన్నాయి.

ఇవి కాకుండా RCB, PBKS, GT ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడగా, మూడు జట్లూ 4 విజయాల తర్వాత ఎనిమిది పాయింట్లు కలిగి ఉన్నాయి. బెంగళూరు, పంజాబ్, గుజరాత్‌లు ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిందే. ప్రస్తుతం అందరి చూపు శుక్రవారం జరగనున్న సీఎస్‌కే వర్సెస్ జీటీ మ్యాచ్‌పైనే ఉంటుంది.


ఇది కూడా చదవండి:

రైజర్సా.. మజాకా!


టీ20 వరల్డ్‌ కప్‌ ఐర్లాండ్‌ కెప్టెన్‌ స్టిర్లింగ్‌


Read Latest Sports News and Telugu News

Updated Date - May 09 , 2024 | 07:22 AM

Advertising
Advertising