ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్

ABN, Publish Date - Mar 27 , 2024 | 10:21 AM

ఐపీఎల్ 2024(ipl 2024 )లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) vs ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్ల మధ్య కీలకమైన మ్యా్చ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్(hyderabad) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

ఐపీఎల్ 2024(ipl 2024 )లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) vs ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్ల మధ్య కీలకమైన మ్యా్చ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్(hyderabad) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ రెండు జట్లు కూడా మొదటి మ్యాచ్ ఓడిపోయిన క్రమంలో ఇది ఎలాగైనా గెలవాలని చూస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో 8వ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH) సొంత మైదానంలో విజయం సాధించాలని భావిస్తోంది. ముంబై, హైదరాబాద్‌ రెండు జట్లకు మంచి ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచుల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.

మొత్తం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్(MI), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 12 ముంబై, 9 హైదరాబాద్ గెలుపొందాయి. ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 200. SRHపై MI అత్యధిక స్కోరు 235 పరుగులు. ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ముంబై నాలుగింటిలో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరిసారిగా 2022లో ముంబైపై గెలిచింది. మరోవైపు గూగుల్(google) అంచనా ప్రకారం ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 56 శాతం గెలిచే అవకాశం ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 శాతం ఉందని తెలిపింది. అయితే ఇది కచ్చితంగా ఇలాగే జరుగుతుందని చెప్పలేం. ఒక అంచనా(win Prediction) మాత్రమే.


సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులో మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, T నటరాజన్ ఉన్నారు.

ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (wk), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్ కలరు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: చెన్నై.. అదిరెన్‌!

Updated Date - Mar 27 , 2024 | 10:27 AM

Advertising
Advertising