ఓదార్పయినా దక్కేనా..!
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:10 AM
ఘోర ప్రదర్శనతో ఈపాటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీ్‌సను చేజార్చుకొన్న భారత మహిళల జట్టు.. క్లీస్‌స్వీప్‌ను తప్పించుకోవాలనుకొంటోంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా బుధవారం జరిగే....
ఆస్ట్రేలియాతో భారత మహిళల మూడో వన్డే నేడు
ఉ. 9.50 నుంచి
పెర్త్: ఘోర ప్రదర్శనతో ఈపాటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీ్‌సను చేజార్చుకొన్న భారత మహిళల జట్టు.. క్లీస్‌స్వీప్‌ను తప్పించుకోవాలనుకొంటోంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా బుధవారం జరిగే మూడో, ఆఖరి వన్డేలో ఓదార్పు విజయం దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. గత రెండు మ్యాచుల్లోనూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ రంగంలోనూ హర్మన్‌ప్రీత్ సేన ఆకట్టుకోలేక పోయింది. షఫాలీ స్థానంలో ఓపెనర్‌గా రిచా ఫర్వాలేదనిపిస్తున్నా.. సీనియర్లు స్మృతి మంధాన, హర్మన్ సహా మిగతా బ్యాటర్ల వైఫల్యం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. బౌలింగ్ విభాగం తేలిపోతుండగా.. ఫీల్డింగ్ వైఫల్యాలు మరింత నిరాశకు గురి చేస్తున్నాయి. మరోవైపు తహిల మెక్‌గ్రాత్ సారథ్యంలోని ఆసీస్ ఫుల్ జోష్‌లో ఉంది. ఓపెనర్ జార్జియా వోల్ పరుగుల వరద పారిస్తూ భారీ స్కోర్లకు బాటలు వేస్తోంది.