ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం.. మొత్తం ఎన్నంటే..

ABN, Publish Date - Sep 05 , 2024 | 08:55 PM

పారిస్ పారాలింపిక్స్ 2024 క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పురుషుల 60 కేజీల J1 ఈవెంట్‌లో కాంస్య పతక పోరులో కపిల్ 10-0తో బ్రెజిల్‌కు చెందిన ఎలిటన్ డి ఒలివెరాపై విజయం సాధించి కాంస్యం సాధించాడు.

Judoka Kapil Parmar

పారిస్ పారాలింపిక్స్ 2024(Paralympics 2024) క్రీడల్లో భారత పారా జూడో ఆటగాడు కపిల్ పర్మార్(kapil parmar) అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. పురుషుల 60 కేజీల J1 ఈవెంట్‌లో కాంస్య పతక పోరులో కపిల్ 10-0తో బ్రెజిల్‌కు చెందిన ఎలిటన్ డి ఒలివెరాపై విజయం సాధించి కాంస్యం సాధించాడు. దీంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 25కి చేరుకుంది. ఈ గేమ్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు ఐదు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించింది. అంతేకాదు పారిస్ పారాలింపిక్స్‌ 2024లో తొలిసారిగా జూడోలో భారత్‌కు పతకం లభించడం విశేషం. ఈ చారిత్రాత్మక పనిని కపిల్ పర్మార్ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.


అప్పుడు

పర్మార్ 2022 ఆసియా గేమ్స్‌లో ఇదే విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అప్పుడు క్వార్టర్ ఫైనల్స్‌లో వెనిజులాకు చెందిన మార్కో డెనిస్ బ్లాంకోను 10–0తో ఓడించాడు. కానీ సెమీ ఫైనల్స్‌లో ఇరాన్‌కు చెందిన S బనితాబా ఖోరమ్ అబాడి చేతిలో ఓడిపోయాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ పర్మార్‌కు ఒక్కో పసుపు కార్డు లభించింది. కానీ కపిల్ అప్పుడు స్వర్ణం తీసుకురాలేకపోయినా.. ఇప్పుడు మాత్రం కాంస్య పతకాన్ని సాధించడంలో సఫలమయ్యాడు. అదే సమయంలో మహిళల 48 కిలోల J2 విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారతదేశానికి చెందిన కోకిల కజకిస్థాన్‌కు చెందిన అక్మరల్ నౌట్‌బెక్‌పై 0-10 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.


9 ఏళ్ల వయస్సులోనే

కపిల్ పర్మార్ మధ్యప్రదేశ్‌లోని సిహోర్ నివాసి. కపిల్ 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, బాధాకరమైన ప్రమాదం జరిగింది. కపిల్ తన ఇంటి వద్ద ఉన్న మోటారు నుంచి నీటిని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలో అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో కపిల్ కంటి చూపు బలహీనపడింది. ఆ క్రమంలో అతను అత్యంత శక్తివంతమైన అద్దాలతో కూడా చూడలేకపోయాడు. అతనికి చాలా బలహీనమైన దృష్టి ఉందని వైద్యులు స్పష్టం చేశారు.


గతంలో

అయితే ఈ ప్రమాదం జరిగినప్పటికీ కపిల్ మాత్రం తన పట్టు వదలలేదు. భోపాల్‌లో క్రమంగా జూడో గురించి తెలుసుకుని ఆట ప్రారంభించాడు. ఆ తర్వాత లక్నోలో శిక్షణ పొందాడు. ఈ జూడో ఆటగాడు కోచ్ మునవ్వర్ అంజర్ అలీ సిద్ధిఖీ నుంచి నైపుణ్యాలను నేర్చుకున్నాడు. తర్వాత కపిల్ ఇండియన్ పారా జూడో అకాడమీలో కఠోర శిక్షణతో తనను తాను మెరుగుపరుచుకున్నాడు. ఈ క్రమంలో 2017లో కపిల్ జూడోలోకి ప్రవేశించాడు. ఆ క్రమంలోనే 2019 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 2022 ఆసియా పారా గేమ్స్‌లో కపిల్ రజత పతకం సాధించాడు. 2023 వరల్డ్ గేమ్స్, గ్రాండ్ ప్రిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు తన కెరీర్‌లో తొలి పారాలింపిక్స్‌లో మరోసారి దేశానికి చారిత్రాత్మక పతకాన్ని అందించి ఔరా అనిపించుకున్నాడు.


ఇవి కూడా చదవండి..

IPL 2024: షాకింగ్ పరిణామం.. ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ ఢమాల్


Simi Singh: హాస్పిటల్‌లో ప్రాణాల కోసం పోరాడుతున్న భారత సంతతి స్టార్ క్రికెటర్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 05 , 2024 | 09:09 PM

Advertising
Advertising