ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: SRH మ్యాచులో రెండు తప్పులు చేసిన KKR ఆటగాడు..భారీగా ఫైన్

ABN, Publish Date - Mar 24 , 2024 | 11:27 AM

ఐపీఎల్ 2024లో నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్ల మధ్య ఉత్కంఠతో కూడిన మ్యాచ్ జరిగింది. ఆ క్రమంలో నాలుగు పరుగుల తేడాతో KKR గెలిచింది. అంతేకాదు కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్‌ గెలుపునకు కారణమయ్యాడు. కానీ అదే సమయంలో మ్యాచ్‌లో చేసిన రెండు తప్పుల కారణంగా హర్షిత్ రాణా(Harshit Rana)పై జరిమానా భారీగా పడింది.

ఐపీఎల్ 2024(IPl 2024)లో నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH) జట్ల మధ్య ఉత్కంఠతో కూడిన మ్యాచ్ జరిగింది. ఆ క్రమంలో నాలుగు పరుగుల తేడాతో KKR గెలిచింది. అంతేకాదు కేకేఆర్(KKR) బౌలర్ హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్‌ గెలుపునకు కారణమయ్యాడు. చివరి ఓవర్లో 13 పరుగులు డిఫెండ్ చేసి కేకేఆర్‌ జట్టును విజయతీరాలకు తీసుకెళ్లాడు.

కానీ అదే సమయంలో మ్యాచ్‌లో చేసిన రెండు తప్పుల కారణంగా హర్షిత్ రాణా(Harshit Rana)పై జరిమానా భారీగా పడింది. హర్షిత్ రాణా IPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో మొత్తం 60 శాతం జరిమానా విధించారు. IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం రెండు లెవల్ 1 నేరాలకు పాల్పడ్డాడు. రెండు సంబంధిత నేరాలకు అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం, 50 శాతం జరిమానా విధించబడింది. హర్షిత్ రెండు నేరాలకు గాను రిఫరీ శిక్షలకు అంగీకరించాడు.


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌(Mayank Agarwal) హర్షిత్ రాణా బౌలింగ్‌కు ఔటయ్యాడు. ఆ సమయంలో రింకూ సింగ్ అద్భుత క్యాచ్ పట్టాడు. దీని తర్వాత హర్షిత్ మయాంక్ చూస్తూ వైపు ఫ్లయింగ్ కిస్(flying kiss) ఇస్తున్నట్లు సైగ చేశాడు. కానీ మయాంక్ అగర్వాల్ అతని వైపు చూస్తూ ఏమీ మాట్లాడకుండా తిరిగివచ్చాడు. ఈ కారణంగా వివాదం పెద్దగా పెరగలేదు. అదే తిరిగి స్పందిస్తే వివాదం మరింత పెరిగేది. దీంతోపాటు హర్షిత్ రాణా చివరిలో హెన్రిచ్ క్లాసెన్‌(henric classen)తో కూడా గొడవ పడ్డాడు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: KKR vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ఈ ఆటగాళ్లే కారణం?

Updated Date - Mar 24 , 2024 | 11:30 AM

Advertising
Advertising