Share News

KL RAhul: సరిగ్గా పదేళ్ల క్రితం అతడి స్థానంలో నేనున్నా.. కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Dec 04 , 2024 | 04:25 PM

పెర్త్ వేదికపై ఆడిన తొలి టెస్టు కేఎల్ రాహుల్ కు తన పాత రోజులను గుర్తు చేసింది. పదేళ్ల క్రితం బిక్కుబిక్కుమంటూ ఆసిస్ పర్యటనకు వచ్చిన తన అనుభవాన్ని మళ్లీ ఓ యంగ్ క్రికెటర్ తనకు గుర్తుచేశాడంటూ తెలిపాడు..

KL RAhul: సరిగ్గా పదేళ్ల క్రితం అతడి స్థానంలో నేనున్నా..  కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
KL Rahul, Yashaswi Jaiswal

ముంబై: పెర్త్ వేదికపై టీమిండిమా బ్యాటర్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ భాగస్వామ్యం సరికొత్త రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్టులోనూ ఈ జోడీ మ్యాజిక్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన యశస్వి జైస్వాల్ ప్రదర్శనను పలువురు మాజీలు, సీనియర్లు సైతం కొనియాడారు. వీరిద్దరి రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన భారత్ ను 295 పరుగుల విజయం దిశగా నడిపించింది. కేఎల్ రాహుల్ 77 పరుగుల కీలక నాక్ ఆడగా.. జైస్వాల్ మొదటి ఇన్నింగ్స్ డకౌట్ తర్వాత 161 పరుగులు ఛేదించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.


ఈ మ్యాచ్ పై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ జైస్వాల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తొలి రోజు మ్యాచ్ లో జైస్వాల్ ముందుగానే డకౌట్ కావడంతో ఇద్దరికీ అంత స్కోప్ లభించలేదన్నాడు. ఆ తర్వాత రోజు మాత్రం జైస్వాల్ తో బ్యాటింగ్ చేయడం తనకు ప్రత్యేక అనుభూతిని మిగిల్చిందన్నాడు. ఈ 22 ఏళ్ల ఆటగాడిలో తనను తాను చూసుకున్నానని రాహుల్ అన్నాడు. తన పాత ఓపెనింగ్ పార్టనర్ లాగే తాను కూడా జైస్వాల్ ని శాంతింపజేస్తూ గైడ్ చేసినట్టుగా తెలిపాడు.


ఓవర్సీస్ లో ప్రయాణించినప్పుడు ఓపెనింగ్ పార్ట్ నర్ జట్టులో ఉండాల్సిన అవసరాన్ని నేను నిజంగా రియలైజ్ అయ్యాను. నాలాంటి ఒకరు పక్కనున్నప్పుడే జైస్వాల్ వంటి క్రికెటర్ ను అదుపు చేయగలరు. అతడ్ని చూస్తుంటే దాదాపు పదేళ్ల క్రితం ఓపెనింగ్ బ్యాటింగ్ కు దిగిన నాకు నేను గుర్తుచేసుకున్నాను. ఎన్నో సందేహాలు, ఆతృత.. ఒక్కోసారి మన గేమ్ పై మనకే నమ్మకం ఉండదు. బుర్ర గిర్రున తిరుగుతుంటుంది. అలాంటప్పుడు కాస్త నిదానంగా ఉంటూ దీర్ఘంగా శ్వాస తీసుకుని ఒకే విషయంపై ధ్యాస పెట్టగలగాలి అని తెలిపాడు. నాకు ఆ సమయంలో నా తోటి క్రికెటర్ మురళీ విజయ్ నుంచి ఇలాంటి మద్దతే లభించింది. నేను నా అనుభవాన్ని జైస్వాల్ కి అందించాను అని కేఎల్ రాహుల్ తెలిపాడు. అతడు తొలి 30-40 బంతులను ఆడేవరకే నెర్వస్ గా కనిపించాడు. ఆ తర్వాత పూర్తి ఆత్వవిశ్వాసంతో ప్రదర్శన చేశాడు అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

Vinod Kambli: ఒకప్పటి క్రికెట్ లెజెండ్.. సచిన్ ప్రాణ స్నేహితుడు ఇప్పుడిలా..


Updated Date - Dec 04 , 2024 | 05:06 PM