Koneru Humpy: ప్రపంచ వేదికపై సత్తాచాటిన కోనేరు హంపి..
ABN, Publish Date - Dec 29 , 2024 | 08:49 AM
ప్రపంచస్థాయి చెస్ పోటీల్లో భారత ఆటగాళ్లు మళ్లీ సత్తా చాటారు. అమెరికా దేశం న్యూయార్క్ వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్-2024, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపీ గెలుపొంది చరిత్ర సృష్టించారు.
హైదరాబాద్: ప్రపంచస్థాయి చెస్ పోటీల్లో భారత ఆటగాళ్లు మళ్లీ సత్తా చాటారు. అమెరికా దేశం న్యూయార్క్ (New York) వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ -2024, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపీ (Koneru Humpy) గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఈ పోటీల్లో ఆమె 8.5 పాయింట్లతో ప్రత్యర్థి అయిన ఇండోనేషియా ప్లేయర్ ఇరిన్ ఖరిష్మా సుకందర్ (Kharisma Sukander)పై ఆమె విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన పదకొండో రౌండ్‌లో కోనేరు హంపి గెలుపొంది భారత గౌరవాన్ని మరింత పెంచారు. 2019లో మాస్కో వేదికగా జరిగిన మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను సైతం కోనేరు సొంతం చేసుకున్నారు. కాగా, ఇది ఆమెకు రెండో ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్. మహిళల విభాగంలో ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా రెండుసార్లు గెలిచి కోనేరు హంపి రికార్డు సృష్టించారు.
మరోవైపు కోనేరు హంపి విజయం సాధించడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హంపిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. "2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా కోనేరు హంపి కిరీటాన్ని కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ అసాధారణమైన ఫీట్.. మీ పట్టుదల, సంకల్పం, ఆటలో నైపుణ్యానికి అద్దం పడుతోంది. హంపి మరిన్ని విజయాలు సాధించి యువతకు స్ఫూర్తిని ఇవ్వాలి. మీరు నిజమైన భారతీయ చెస్ లెజెండ్" అంటూ లోకేశ్ కొనియాడారు.
Updated Date - Dec 29 , 2024 | 01:59 PM