ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manu Bhaker: మను భాకర్ ఒలింపిక్ విక్టరీ తర్వాత క్యూ కట్టిన 40కిపైగా బ్రాండ్స్.. ఇక ఆదాయం ఏంతంటే..

ABN, Publish Date - Aug 02 , 2024 | 06:24 PM

దేశంలో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మను భాకర్. టోక్యో ఒలింపిక్స్‌లో మను (Manu Bhaker) ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. ఆ తర్వాత ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుటి కథ మాత్రం పూర్తిగా వ్యతిరేకం. పారిస్ ఒలింపిక్స్‌లో 6 రోజుల్లో భారత్ 3 పతకాలు సాధించింది. అందులో మను భాకర్ రెండు మెడల్స్ సాధించింది. ఈ క్రమంలోనే భాకర్ కోసం 40 కంటే ఎక్కువ బ్రాండ్‌లు ప్రకటనల కోసం పోటీ పడుతున్నాయి.

Manu Bhaker

దేశంలో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మను భాకర్. టోక్యో ఒలింపిక్స్‌లో మను (Manu Bhaker) ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. ఆ తర్వాత ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుటి కథ మాత్రం పూర్తిగా వ్యతిరేకం. పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics 2024)లో 6 రోజుల్లో భారత్ 3 పతకాలు సాధించింది. ముగ్గురూ మెడల్స్ షూటింగ్‌లోనే వచ్చాయి. అందులో మను భాకర్ రెండు మెడల్స్ సాధించింది. ఇప్పుడు మను 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో కూడా మూడో మెడల్ కోసం బరిలో నిలవడం విశేషం. దీంతో 22 ఏళ్ల భాకర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే భాకర్ కోసం 40 కంటే ఎక్కువ బ్రాండ్‌లు ప్రకటనల కోసం పోటీ పడుతున్నాయి. అంతేకాదు ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


లక్షల నుంచి ప్రస్తుతం..

పారిస్ ఒలింపిక్స్‌కు ముందు మను బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ.20 లక్షలు అందుకుంది. ఇప్పుడు దానికంటే 6-7 రెట్లు ఎక్కువ డబ్బు అడుగుతున్నట్లు సమాచారం. గత 2-3 రోజుల్లోనే దాదాపు 40 మంది మమ్మల్ని సంప్రదించారని iOS స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ CEO, MD నీరవ్ తోమర్ తెలిపారు. ప్రస్తుతం దీర్ఘకాలిక ఒప్పందాలపై దృష్టి పెడుతున్నామని అన్నారు. ఆ క్రమంలో కొన్ని ఆమోదాలను పూర్తి చేసామన్నారు.

ఇంతకుముందు

అయితే ఆమె బ్రాండ్ విలువ ఐదు నుంచి ఆరు రెట్లు పెరిగిందన్నారు. ఇంతకుముందు మాకు దాదాపు రూ. 20-25 లక్షలు వచ్చేవి, ఇప్పుడు డీల్ కోసం దాదాపు రూ. 1.5 కోట్లకు చేరుకుందన్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మను భాకర్.. గత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూను అధిగమించే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో మను భాకర్‌తో కొన్ని సంస్థలు స్వల్ప కాలానికి, మరికొన్ని దీర్ఘకాలికంగా కోట్లాది రూపాయల డీల్స్ చేసుకుంటున్నాయి.


నీరజ్ చోప్రా బ్రాండ్ విలువ

గత ఏడాది ఆగస్టులో ఓ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2022 ప్రకారం నీరజ్ చోప్రా బ్రాండ్ విలువ $26.5 మిలియన్లు (రూ. 221 కోట్లు). చోప్రా ప్రస్తుతం వార్షిక ఎండార్స్‌మెంట్ ఫీజుగా రూ.4 కోట్లు వసూలు చేస్తున్నారు. చోప్రా టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్, జిల్లెట్, కంట్రీ డిలైట్, కోకా-కోలా, అండర్ ఆర్మర్‌తో సహా పలు బ్రాండ్‌లకు ప్రకటనలు చేస్తున్నారు. ఒలంపిక్ క్రీడల వేళ ఈ ఏడాది చివరి నాటికి నీరజ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ విలువ మరింత పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి.


Also Read:

Boxers : మహిళల పోటీల్లో పురుషులా?

Swimming : ఎదురులేని లెడెకి

నడాల్‌.. ఒలింపిక్స్‌ ఆఖరి మ్యాచ్‌

For More Sports News and Telugu News..

Updated Date - Aug 02 , 2024 | 06:26 PM

Advertising
Advertising
<