ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MS Dhoni: ఆర్సీబీ ప్లేయర్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన ధోనీ.. అప్పుడు కోహ్లీ ఏం చేశాడంటే!

ABN, Publish Date - May 20 , 2024 | 01:36 PM

ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సంయమనంతో వ్యవహరించి కూల్‌గా బిహేవ్ చేయడం టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోనీ స్టైల్. ధోనీ ఆటే కాదు.. ప్రవర్తనను కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. అలాంటి ధోనీ శనివారం జరిగిన మ్యాచ్‌లో కొత్తగా ప్రవర్తించాడు.

Dhoni Skips Handshakes

ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సంయమనంతో వ్యవహరించి కూల్‌గా బిహేవ్ చేయడం టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) స్టైల్. ధోనీ ఆటే కాదు.. ప్రవర్తనను కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. అలాంటి ధోనీ శనివారం జరిగిన మ్యాచ్‌లో కొత్తగా ప్రవర్తించాడు. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే (RCB vs CSK). ఈ మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించడం ధోనీకి తీవ్ర నిరాశను కలిగించింది (IPL 2024).


మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో షేక్ హ్యాండ్స్ చేసుకోవడం సర్వ సాధారణం. అయితే శనివారం మ్యాచ్ తర్వాత ధోనీ కాస్త వింతగా ప్రవర్తించాడు. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు చెన్నై ఆటగాళ్లు వరుసగా నిలబడ్డారు. ధోనీ అందరి కంటే ముందు ఉన్నాడు. అయితే ఆ సమయంలో బెంగళూరు ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. వారిని చూసిన ధోనీ అక్కడ వెయిట్ చేయకుండా పెవిలియన్ బాట పట్టాడు. ఆర్సీబీ సిబ్బందితో మాత్రం కరచాలనం చేసి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు (Dhoni Skips Handshakes).



మ్యాచ్ అనంతరం మైదానంలో ధోనీ కనిపించకపోవడంతో కోహ్లీ (Virat Kohli) అతడి కోసం వెతికాడు. ఆ తర్వాత ధోనీతో మాట్లాడేందుకు అతడు ఉన్న డ్రెస్సింగ్ రూమ్‌కువెళ్లాడు. కాగా, ధోనీ ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్సీబీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధోనీ ప్రవర్తన తమకు షాకింగ్‌గా అనిపించిందంటూ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Pat Cummins: అతడికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరం.. సన్‌‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు!


MS Dhoni: ధోనీ రిటైర్‌మెంట్‌పై సీఎస్కే క్లారిటీ.. మరో రెండు నెలల తర్వాత..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2024 | 01:36 PM

Advertising
Advertising