ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jasprit Bumrah: ధోనీ, రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పిన బుమ్రా!

ABN, Publish Date - Jul 27 , 2024 | 10:16 AM

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి టీమిండియాకు ఎంపికయ్యాడు. 2016లో టీమిండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అరంగేట్రం చేశాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తరఫున ఆడాడు.

, MS Dhoni, Virat Kohli, Rohit Sharma

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐపీఎల్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి టీమిండియాకు ఎంపికయ్యాడు. 2016లో టీమిండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అరంగేట్రం చేశాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తరఫున ఆడాడు. టెస్ట్‌లు, వన్డేలు, టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా సత్తా చాటాడు. బుమ్రా అరంగేట్రం తర్వాత టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించిన కోహ్లీ, రోహిత్, ధోనీలలో బెస్ట్ ఎవరు? ఇదే ప్రశ్న బుమ్రాకు ఎదురైంది. ఈ ప్రశ్నకు బుమ్రా షాకింగ్ సమాధానం చెప్పాడు (Best captain).


తాజాగా ఓ ప్రోగ్రామ్‌కు హాజరైన బుమ్రాకు ``ఇప్పటివరకు టీమిండియాకు నాయకత్వం వహించిన వారిలో బెస్ట్ ఎవరు`` అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు బుమ్రా స్పందిస్తూ.. ``నేనే`` అని సమాధానం ఇచ్చాడు. ``నా దృష్టిలో నేనే బెస్ట్ కెప్టెన్‌ని. నేను కొన్ని మ్యాచ్‌లకు నాయకత్వం వహించా. టీమిండియాకు చాలా మంది గొప్ప కెప్టెన్సీ చేశారు. కానీ, నేను నా పేరునే ఎంచుకుంటా`` అంటూ సమాధానం ఇచ్చాడు. బుమ్రా ఇప్పటికే ఒక టెస్ట్ మ్యాచ్‌కు, రెండు టీ20లకు నాయకత్వం వహించాడు. అసలు బౌలర్లకు ఎందుకు కెప్టెన్సీ ఇవ్వరు అనే ప్రశ్నకు బుమ్రా సమాధానం చెప్పాడు.


``బౌలర్ల జాబ్ చాలా కష్టం. వాళ్లు బ్యాట్‌ల వెనకాల దాక్కోరు. మ్యాచ్‌లో ఓటమి పాలైతే అందరూ బౌలర్లనే నిందిస్తారు. ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయడానికి బౌలర్లు కొత్త దారులు వెతకాలి. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. ఎంతో శారీరక శ్రమ పడాలి. కానీ, బ్యాటర్ల కంటే బౌలర్లే స్మార్ట్‌గా ఆలోచిస్తారు. కపిల్ దేవ్, వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, ప్యాట్ కమిన్స్ తమ జట్లను అద్భుతంగా నడిపించారు. వారిలో ముగ్గురు ప్రపంచకప్‌లను కూడా సాధించార``ని బుమ్రా అన్నాడు.

ఇవి కూడా చదవండి..

Cricket: ఆటగాడిగా విఫలం.. కోచ్‌గా రాణిస్తారా.. శ్రీలంకపై గంభీర్ ప్రతీకారం తీర్చుకుంటారా..!


Olympic Games Paris 2024: పతకాల పట్టికలో తొలిరోజు భారత్ ఖాతా తెరుస్తుందా.. ఆశలన్నీ వాళ్లపైనే..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 27 , 2024 | 10:16 AM

Advertising
Advertising
<