ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా కమిన్స్..ఈసారి టైటిల్ మనదేనా?

ABN, Publish Date - Mar 04 , 2024 | 11:53 AM

ఐపీఎల్ 2024కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్(Pat Cummins)ను కెప్టెన్‌గా నియమించింది. ఐడెన్ మార్క్రామ్ స్థానంలో కమిన్స్ వచ్చాడు.

ఐపీఎల్ 2024(IPL 2024)కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్(Pat Cummins)ను కెప్టెన్‌గా నియమించింది. ఐడెన్ మార్క్రామ్ స్థానంలో కమిన్స్ వచ్చాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ట్వీట్ చేసి ప్రకటించిందియ. ఐపీఎల్ 2024కి ప్యాట్ కమిన్స్ మా కొత్త కెప్టెన్. దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ స్థానంలో కమిన్స్ జట్టులోకి వచ్చాడని.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కమిన్స్ 10వ కెప్టెన్ అని తెలిపింది.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడు కావ్య మారన్(kavya maran) బృందం కమిన్స్‌పై విశ్వాసం వ్యక్తం చేసింది. అంతేకాదు ఈసారి ఎలాగైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలవాలని భావిస్తోంది.


ఐపీఎల్ 2023 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) రూ.20.5 కోట్లకు పాట్ కమిన్స్‌ను కొనుగోలు చేసింది. కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో కమిన్స్ తనదైన ప్రాముఖ్యత దక్కించుకున్నారు. పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2023 సంవత్సరంలో రెండు ICC టైటిళ్లను (WTC ఫైనల్, క్రికెట్ వరల్డ్ కప్) గెలుచుకుంది. ఈ రెండు టైటిళ్లను భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా గెలుచుకుంది. పాట్ కమిన్స్ 2023 సంవత్సరంలో మొత్తం 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 422 పరుగులు చేసి 59 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: India vs Pakistan: త్వరలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. టిక్కెట్ ధర తెలిస్తే షాక్!

Updated Date - Mar 04 , 2024 | 11:53 AM

Advertising
Advertising