Classical Chess: క్లాసికల్ చెస్‌లో మళ్లీ వావ్ అనిపించిన ప్రజ్ఞానంద.. ప్రపంచ నం.2ను కూడా..
ABN, Publish Date - Jun 02 , 2024 | 09:56 AM
18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద(Praggnanandhaa) మళ్లీ అదరగొట్టాడు. నార్వే(Norway) చెస్(chess) టోర్నమెంట్‌లో ఐదో రౌండ్ క్లాసికల్ చెస్(classical chess)లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించి వావ్ అనిపించుకున్నాడు.
18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద(Praggnanandhaa) మళ్లీ అదరగొట్టాడు. నార్వే(Norway) చెస్(chess) టోర్నమెంట్‌లో ఐదో రౌండ్ క్లాసికల్ చెస్(classical chess)లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించి వావ్ అనిపించుకున్నాడు. ఈ విజయంతో క్లాసిక్ చెస్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్, నంబర్ 2 ప్లేయర్ కరువానాను కూడా ప్రజ్ఞానంద తొలిసారి ఓడించడం విశేషం.
దీంతో ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (FIDE) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి చేరుకున్నాజడు. 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ అంతకుముందు మూడో రౌండ్‌లో కార్ల్‌సెన్‌ను ఓడించాడు. FIDE చెస్ ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద అద్భుతమైన ఎత్తుగడతో కార్ల్‌సెన్‌ను ఓడించాడు. దీనికి ముందు కూడా తన కెరీర్‌లో కొన్ని సందర్భాల్లో ప్రజ్ఞానంద ర్యాపిడ్, బ్లిట్జ్ గేమ్‌లలో కార్ల్‌సెన్‌ను ఓడించాడు.
శనివారం రాత్రి క్లాసికల్ చెస్ గేమ్‌లో ఐదో రౌండ్‌లో ప్రపంచ నంబర్ టూ ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించి ప్రజ్ఞానంద తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అదే సమయంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి(Vaishali) దిగ్గజ క్రీడాకారిణి పియా క్రామ్లింగ్‌ను ఓడించడం ద్వారా తన ఆకట్టుకునే ప్రదర్శనను కొనసాగించింది. తన ఆధిక్యాన్ని మొత్తం 8.5 పాయింట్లకు పెంచుకుంది.
ఇవి కూడా చదవండి..
T20 World Cup : వచ్చేసింది క్రికెట్ తుఫాన్!
Viral Video: ఇదేం ఖర్మరా బాబూ.. నడిరోడ్డు మీద వింత స్టంట్లు ఎందుకోసమో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 02 , 2024 | 10:20 AM