ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

R Praggnanandhaa: ప్రపంచ నం.1 కార్ల్‌సన్‌ను క్లాసికల్ చెస్‌లో చిత్తుగా ఓడించిన మన కుర్రాడు

ABN, Publish Date - May 30 , 2024 | 10:31 AM

నార్వేలో 12వ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్(Norway Chess tournament) 2024 జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన గేమ్ మూడో రౌండ్‌లో భారతీయ కుర్రాడు ఆర్ ప్రజ్ఞానంద(R Praggnanandhaa) అదరకొట్టాడు. క్లాసికల్ రేటింగ్ గేమ్‌లో మొదటిసారిగా ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నార్వేకు చెందిన కార్ల్‌సన్‌ను చిత్తుగా ఓడించాడు.

R Praggnanandhaa defeated Carlsen

నార్వేలో 12వ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్(Norway Chess tournament) 2024 జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన గేమ్ మూడో రౌండ్‌లో భారతీయ కుర్రాడు ఆర్ ప్రజ్ఞానంద(R Praggnanandhaa) అదరకొట్టాడు. క్లాసికల్ రేటింగ్ గేమ్‌లో మొదటిసారిగా ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నార్వేకు చెందిన కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద చిత్తుగా ఓడించాడు. 3వ రౌండ్‌లో కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానానంద 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. క్లాసికల్ టోర్నమెంట్‌లో తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌ను ఓడించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రజ్ఞానంద ఈసారి బాగా రాణించి 37వ ఎత్తులో ఈ విజయం సాధించాడు.


దీంతో ప్రజ్ఞానంద(Praggnanandhaa)కు అనేక మంది సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద ఫ్రాన్స్‌కు చెందిన అలీరెజాలతో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో 44వ ఎత్తులో ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. ఆర్ ప్రజ్ఞానంద ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ టోర్నమెంట్ 2022లో మాగ్నస్ కార్ల్‌సెన్‌ను మొదటిసారి ఓడించాడు. ఈ నెల ప్రారంభంలో పోలాండ్‌లోని వార్సాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సూపర్‌బెట్ బ్లిట్జ్ 2024లో కూడా ప్రపంచ నం.1పై ప్రజ్ఞానంద తన మొట్టమొదటి ఓవర్-ది-బోర్డ్ రేటింగ్ గేమ్ లో విజయాన్ని సాధించాడు.


ఇది కూడా చదవండి:

T20 World Cup : చరిత్ర ముంగిట..


అందరి దృష్టీ ఆ పోరుపైనే!

Read Latest Sports News and Telugu News

Updated Date - May 30 , 2024 | 10:46 AM

Advertising
Advertising