Rahul Dravid: మెంటార్‌గా రాహుల్ ద్రావిడ్..!! ఏ టీమ్‌కంటే..?
ABN, Publish Date - Jul 09 , 2024 | 04:07 PM
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు.
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid). 17 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు. అతని భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది..?
ఒకరి స్థానంలోకి మరొకరు..?
ద్రావిడ్ స్థానంలోకి గంభీర్ వస్తున్నారు. మరి ద్రావిడ్ ఏం చేయబోతున్నారు.. ఇదే అంశం క్రికెట్ అభిమానుల మెదడును తొలచి వేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ద్రావిడ్ పేరును కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం మెంటార్ కోసం పరిశీలిస్తోందని తెలిసింది. 2024 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ జట్టును మెంటార్ గంభీర్ ముందుండి నడిపారు. ఆ జట్టు టైటిల్ కైవసం చేసుకోవడంలో గంభీర్ అమలు చేసిన ప్రణాళికలు విజయం సాధింాచయి. సునీల్ నరైన్ ఓపెనింగ్ పంపించడం, ఇతర అంశాలు వర్కవుట్ అయ్యాయి. సీజన్ ముందే గంభీర్‌ను కో ఓనర్ షారుక్ ఖాన్ మెంటార్‌గా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. జట్టుకు సంబంధించిన పదేళ్ల ప్రణాళికను అందజేశారు. అనూహ్యంగా బీసీసీఐ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో గంభీర్ కాదనలేక పోయారని తెలుస్తోంది.
Suryakumar Yadav: ఫైనల్ మ్యాచ్‌లో కాదు.. తన లైఫ్‌లో బెస్ట్ క్యాచ్ అదే అంటున్న సూర్యకుమార్ యాదవ్!
ఆ లోటును పూడ్చేది ఎవరంటే..?
కేకేఆర్ జట్టుకు గంభీర్ లేని లోటును పూడ్చటం ఎలా అని యజమాన్యం భావిస్తోంది. ఆ క్రమంలో టీమిండియాను విజయపథంలో నడిపిన ద్రావిడ్ పేరును కేకేఆర్ మెనేజ్ మెంట్ పరిశీలించిందని తెలిసింది. ఒక కేకేఆర్ కాదు.. ఐపీఎల్‌లో మిగతా జట్టు కూడా ద్రావిడ్‌ను కోచ్ లేదంటే మెంటార్‌గా కొనసాగాలని భావిస్తున్నాయట. దీనికి సంబంధించి అధికారిక సమాచారం మాత్రం లేదని న్యూజ్ 18 బంగ్లా పేర్కొంది. వరల్డ్ కప్ సీజన్ ముగిసిన తర్వాత వచ్చే నెల నుంచి ఖాళీగా ఉంటానని ద్రావిడ్ సరదాగా కామెంట్ చేశారు. అత్యంత ప్రతిభ కలిగిన ద్రావిడ్ లాంటి వ్యక్తికి ఆఫర్స్ ఎక్కువగానే ఉన్నాయి. అతని కోసం ఫ్రాంచైజీలు రెడ్ కార్పెట్ పరుస్తాయని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. కేకేఆర్ లేదంటే ఇతర ప్రాంఛైజీల్లో మిస్టర్ డిపెండబుల్ పనిచేయడం పక్కా అని చెబుతున్నారు.
కంటిన్యూ కాలేక..!!
వాస్తవానికి ఇండియా కోచ్‌గా కంటిన్యూ కావాలని ద్రావిడ్‌ను బీసీసీఐ కోరింది. అందుకు ఆయన నిరాకరించారు. కారణం ఏంటంటే..? కోచ్‌గా 10 నెలలు విదేశాల్లో గడిపాలి.. కుటుంబానికి దూరంగా ఉండాలి. ఆ కారణంతో కొనసాగేందుకు అంగీకరించలేదు. ఐపీఎల్ అయితే 2, 3 నెలల సమయం కేటాయిస్తే సరిపోతుంది. ఆ కోణంలో ఐపీఎల్ కోసం పనిచేసే అవకాశం ఉంది. కుటుంబంతో గడిపే వెసులుబాటు కలుగుతుంది. గతంలో ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా, కోచ్‌గా పనిచేసిన అనుభవం ద్రావిడ్‌కు ఉంది. ఐపీఎల్ ఢిల్లీ జట్టు కోచ్ నుంచి ఇండియా జూనియర్ జట్టుకు కోచ్‌గా ద్రావిడ్ వెళ్లారు. అండర్-19 జట్టు నుంచి మెలికల్లాంటి కుర్రాళ్లను తీసుకొచ్చారు. తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేశారు. తర్వాత తిరిగి ఐపీఎల్ మెంటార్ లేదంటే హెడ్ కోచ్‌గా వెళ్లే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
Suryakumar Yadav: ఫైనల్ మ్యాచ్‌లో కాదు.. తన లైఫ్‌లో బెస్ట్ క్యాచ్ అదే అంటున్న సూర్యకుమార్ యాదవ్!
Team India Prize money: టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ.. ఎవరెవరికి ఎంతెంతంటే..!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 09 , 2024 | 04:07 PM