Rahul Dravid:అండర్-19 జట్టులోకి సమిత్
ABN, Publish Date - Aug 31 , 2024 | 11:45 AM
ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్. తండ్రికి తగ్గట్టే తనయుడు కూడా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. బ్యాట్‌తోనే కాదు బాల్‌తో సత్తా చాటుతున్నాడు. సమిత్‌ను ఆల్ రౌండర్ అనడం బెటర్. కర్ణాటక తరఫున రంజీ మ్యాచ్‌ల్లో ఆడి, ఆ జట్టుకు విజయాలు అందజేశాడు. ప్రస్తుతం మైసూర్ వారియర్స్ తరఫున కేఎస్‌సీఏ మహారాజా టీ 20 ట్రోఫీలో ఆడుతున్నాడు.
రాహుల్ ద్రావిడ్.. టీమిండియా మాజీ కెప్టెన్. మొన్నటి వరకు టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేశారు. ద్రావిడ్ అంటే క్రికెట్‌లో ఒక లెజెండ్, మిస్టర్ డిపెండబుల్ అని అందరూ పిలుచుకుంటారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేశారు. వన్డే, టీ 20లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ద్రావిడ్‌కు తెలిసింది క్రికెటే.. క్రికెటే అతని లోకం, ప్రపంచం. వివాదాలకు ఆమడదూరంలో ఉంటారు. ఏ రోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. నిర్ణయాలు కూడా తీసుకోలేదు.
అచ్చం తండ్రి లాగే..
ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్. తండ్రికి తగ్గట్టే తనయుడు కూడా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. బ్యాట్‌తోనే కాదు బాల్‌తో సత్తా చాటుతున్నాడు. సమిత్‌ను ఆల్ రౌండర్ అనడం బెటర్. కర్ణాటక తరఫున రంజీ మ్యాచ్‌ల్లో ఆడి, ఆ జట్టుకు విజయాలు అందజేశాడు. ప్రస్తుతం మైసూర్ వారియర్స్ తరఫున కేఎస్‌సీఏ మహారాజా టీ 20 ట్రోఫీలో ఆడుతున్నాడు. సమిత్ ప్రతిభకు మంచి అవకాశం వచ్చింది. అండర్- 19 క్రికెట్ జట్టులో చోటు లభించింది.
కీలక సిరీస్‌కు ఎంపిక
ఆస్ట్రేలియాతో జరిగే అండర్-19 జట్టులో సమిత్‌కు అవకాశం దక్కింది. సెప్టెంబర్ 21, 23, 26వ తేదీల్లో పుదుచ్చేరిలో మ్యాచ్‌లు జరగనున్నాయి. అండర్ 19 జట్టుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ అమన్ నేతృత్వం వహిస్తాడు. ప్రస్తుతం సమిత్ కేఎస్‌సీఏ టోర్నీలో ఆడుతున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 33 పరుగులు అత్యధిక స్కోరు. సమిత్ మంచి ఫేస్ బౌలర్.. కానీ టోర్నీలో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. కర్ణాటక జట్టుకు ప్రతిష్ఠాత్మకమైన కూచ్ బిహర్ ట్రోఫిని సమిత్ అందజేశాడు. 8 మ్యాచ్‌ల్లో 362 పరుగులు చేశాడు. జమ్ము కశ్మీర్ జట్టు మీద 98 పరుగులు చేశాడు.
నెక్ట్స్ టార్గెట్ అదేనా..?
రంజి జట్టు నుంచి అండర్-19లో ఆడే అవకాశం సమిత్‌కు లభించింది. ఇక్కడ ఫ్రూవ్ చేసుకుంటే నెక్ట్స్ సమిత్ టీమిండియాకు ఆడటం పక్కా. తండ్రి ద్రావిడ్ లాగే సమిత్‌లో మంచి క్రికెటర్ ఉన్నాడని ఆనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
Updated Date - Aug 31 , 2024 | 11:45 AM