ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ravichandran Ashwin: నా రిటైర్మెంట్‌కు ఎవరూ కారణం కాదు.. నాకు ఎవరిపైనా కోపం లేదు: అశ్విన్

ABN, Publish Date - Dec 25 , 2024 | 08:55 PM

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన తర్వాత అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఘనమైన వీడ్కోలు లేకుండానే నిష్క్రమించాడు.

Ravichandran Ashwin

సీనియర్ స్పిన్నర్, పదేళ్లకు పైగా టెస్ట్‌ల్లో టీమిండియాకు కీలక బౌలర్‌గా నిలిచిన రవిచంద్రన్ ఆశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అశ్విన్ తన రిటైర్మెంట్ (Ashwin retirement) నిర్ణయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన తర్వాత అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఘనమైన వీడ్కోలు లేకుండానే నిష్క్రమించాడు. అశ్విన్ అంత హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో కారణం ఉందని చాలా మంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ తన స్పందనను తెలియజేశాడు (Ind vs Aus Test Series).


``గ్రాండ్ సెండాఫ్‌లు అనేవి సెలబ్రిటీ సంస్కృతిలో భాగం. నాకు అలాంటి ఘనమైన వీడ్కోలు ఇష్టం ఉండదు. నా కోసం ఎవరైనా భావోద్వేగానికి గురి కావడం, బాధపడడం నాకు నచ్చదు. నాకు ఎవరూ గొప్ప వీడ్కోలు ఇవ్వనవసరం లేదు. కేవలం నా సెలబ్రేషన్ కోసమే మరో మ్యాచ్ ఆడడం నాకు ఇష్టం ఉండదు. నేను సాధించిన విజయాలు, ఆట గురించి నా దృక్పథం, ఆట నుంచి నిష్క్రమించిన విధానం గుర్తుంటే చాలు. వేరొకరికి మనపై ఉన్న ప్రేమ గురించి మనమెందుకు ఆలోచించాలి. వారి వెనుక ఎందుకు పరిగెత్తాలి`` అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.


``నాది అద్భుతమైన కెరీర్. 537 వికెట్లు తీసిన తర్వాత కూడా సంతృప్తికరంగా, సంతోషంగా లేకపోతే మరిక దేనికి హ్యాపీగా ఫీల్ కావాలి. నేను అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రమే వీడ్కోలు పలికా. క్రికెట్ గురించి మాట్లాడతా. యూట్యూబ్‌లో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తా. కోచింగ్ చేస్తా. నా రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా నాదే. దానికి ఎవరూ బాధ్యులు కాదు. ఒకవేళ ఎవరైనా బాధ్యులైతే వారెవరో నాకు తెలియదు. నాకు ఎవరిపైనా కోపం లేదు`` అంటూ అశ్విన్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 25 , 2024 | 08:55 PM