ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ravindra Jadeja: 1000 రన్స్, 100 క్యాచ్‌లు, 100 వికెట్లు.. ఐపీఎల్ చరిత్రలో జడేజా సరికొత్త రికార్డ్

ABN, Publish Date - Apr 09 , 2024 | 06:53 AM

ఐపీఎల్(IPL) చరిత్రలో రవీంద్ర జడేజా(ravindra jadeja) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 100 క్యాచ్‌లు(100 catches) పట్టిన 5వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లతో పాటు 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు.

ravindra jadeja 100th catch IPL 2024

ఐపీఎల్(IPL) చరిత్రలో రవీంద్ర జడేజా(ravindra jadeja) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 100 క్యాచ్‌లు(100 catches) పట్టిన 5వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లతో పాటు 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2024(IPL 2024)లో చెన్నై సూపర్ కింగ్స్‌(CSK), కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR)తో జరిగిన 22వ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచులో జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి ముగ్గురు కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. సునీల్ నారాయణ్, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్‌లను జడేజా పెవిలియన్‌కు పంపించాడు.


ముస్తాఫిజుర్ రెహమాన్ బంతికి కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(shreyas iyer) అద్భుత క్యాచ్(catch) జడేజా పట్టడంతో 100 క్యాచ్‌ల రికార్డు జడ్డూ దక్కించుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పట్టిన నాల్గవ భారతీయుడు కాగా, ప్రపంచంలో ఐదో ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మలు ఈ ఘనతను సాధించారు.

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు

110- విరాట్ కోహ్లీ

109- సురేష్ రైనా

103- కీరన్ పొలార్డ్

100- రోహిత్ శర్మ

100- రవీంద్ర జడేజా*

98- శిఖర్ ధావన్


మరోవైపు ఐపీఎల్‌లో 1000+ పరుగులు, 100+ వికెట్లు, 100+ క్యాచ్‌లు అందుకున్న ప్రపంచంలోనే(world wide) తొలి క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. రవీంద్ర జడేజా 2008 నుంచి ఐపీఎల్‌లో మొదటి సీజన్‌లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 231 మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్‌గా 2,776 పరుగులు చేశాడు. బౌలర్‌గా ఇప్పటి వరకు 156 వికెట్లు తీశాడు. IPL చరిత్రలో 2000 కంటే ఎక్కువ పరుగులు, 150 కంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి ఆటగాడు కూడా జడేజా కావడం విశేషం.


ఇది కూడా చదవండి:

పట్టాలెక్కిన చెన్నై


సుమిత్‌ సంచలనం

మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 09 , 2024 | 06:55 AM

Advertising
Advertising