మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CSK vs RCB: అందుకే ఓడిపోయామని చెప్పిన ఆర్సీబీ కెప్టెన్.. లేదంటే

ABN, Publish Date - Mar 23 , 2024 | 06:47 AM

ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 17వ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమికి గల కారణాలను RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వెల్లడించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

CSK vs RCB: అందుకే ఓడిపోయామని చెప్పిన ఆర్సీబీ కెప్టెన్.. లేదంటే

ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 2024 17వ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(ruturaj gaikwad) నేతృత్వంలోని CSK 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ని ఓడించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమికి గల కారణాలను RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(Faf du Plessis) వెల్లడించారు.

''చెన్నై(Chennai) మిడిల్ ఓవర్లలో బాగా ఆడింది. స్పిన్ బౌలింగ్‌తో ఒత్తిడిని సృష్టించింది. దురదృష్టవశాత్తు, మేము మొదటి 6-7 ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోయాము. తర్వాత బ్యాట్స్‌మెన్స్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పిచ్ చాలా బాగుంది, కానీ మేము 15 నుంచి 20 పరుగులు తక్కువ చేశాము. మేము మ్యాచ్‌లో ముందంజలో ఉండటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాము. మేము షార్ట్ బంతులతో వికెట్లు తీయాలని ప్రయత్నించాము, కానీ అది సక్సెస్ కాలేదు. మిడిల్ ఓవర్లలో విఫలం కావడం వల్ల పరుగులు తక్కువగా వచ్చాయి.'' - RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్


మరోవైపు ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్(batting) తీసుకోవడం వల్లే విఫలమైందని పలువురు అంటున్నారు. అంతేకాదు విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించి చెన్నైపై చాలా నెమ్మదిగా ఆడారని చెబుతున్నారు. అంతేకాదు మరోవైపు రజత్‌ పటీదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఖాతా కూడా తెరవలేదని చెప్పారు. దీంతోపాటు బౌలర్లు కూడా చెన్నై ఆటగాళ్లను కట్టడి చేయలేకపోయారని, స్కోర్ టార్గెట్ కూడా తక్కువ ఉండటం కూడా వారి గెలుపునకు కారణమని పేర్కొన్నారు. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో శుక్రవారం రాత్రి టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ(RCB) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆటకు దిగిన చెన్నై(CSK) లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL : సూపర్‌ బోణీ

Updated Date - Mar 23 , 2024 | 07:28 AM

Advertising
Advertising