ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rishabh Pant: అంపైర్‌తో రిషభ్ పంత్ గొడవ.. జరిమానా విధించాల్సిందేనా?

ABN, Publish Date - Apr 13 , 2024 | 11:41 AM

ఒక్కోసారి ఆటగాళ్లు మైదానంలో సహనం కోల్పోతుంటారు. తమకు అనుకూలంగా తీర్పు రానప్పుడు.. అంపైర్లపై కోపం ప్రదర్శిస్తుంటారు. వాళ్లతో గొడవలకు దిగుతుంటారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా అదే పని చేశాడు.

Rishabh Pant DRS Row With Umpire

ఒక్కోసారి ఆటగాళ్లు మైదానంలో సహనం కోల్పోతుంటారు. తమకు అనుకూలంగా తీర్పు రానప్పుడు.. అంపైర్లపై కోపం ప్రదర్శిస్తుంటారు. వాళ్లతో గొడవలకు దిగుతుంటారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా అదే పని చేశాడు. వైడ్ బాల్ విషయంలో డీఆర్ఎస్ (DRS) కాల్‌పై అతను ఆన్-ఫీల్డ్ అంపైర్‌పై తీవ్ర వాగ్వాదానికి దిగాడు. చివరికి తనదే తప్పు అని తేలడంతో.. రిషభ్ మిన్నకుండిపోవాల్సి వచ్చింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Mallikarjuna Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్.. అసలేమైందంటే?


శుక్రవారం ఢిల్లీ జట్టుతో జరిగిన లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో ఇషాంత్ శర్మ (Ishant Sharma) నాలుగో ఓవర్ వేయగా.. అతడు వేసిన నాలుగో బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. అది వైడ్ కాదని భావించిన రిషభ్ పంత్.. రివ్యుకి అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్ డీఆర్ఎస్ కాల్ ఇచ్చాడు. రివ్యూలో అది వైడ్ బాల్ అని తేలడంతో.. రిషభ్ పంత్ అసహనానికి గురయ్యాడు. తాను అసలు రివ్యూనే అడగలేదని ఫీల్డ్-అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. వీరి మధ్య ఈ వాగ్వాదం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు సాగింది. ఈ క్రమంలో రీప్లే చేయగా.. పంత్ రివ్యూ అడిగినట్లు తేలింది. దీంతో తప్పు తనదేనని తేలడంతో పంత్ సైలెంట్ అయిపోయాడు.

Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఐపీఎల్‌లో మూడో ఆటగాడు

అయితే.. ఈ ఘటనపై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ (Adam Gilchrist) తీవ్రంగా స్పందించాడు. పంత్ తీరు సరైంది కాదని, అతని జరిమానా విధించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘‘ఏ ఫార్మాట్‌లో అయినా సరే, మ్యాచ్‌ని నియంత్రించేందుకు అంపైర్లకు మరింత వెసులుబాటు కల్పించాలి. రిషభ్ రివ్యూ కోరాడా? లేదా? అనే దానిపై వివాదం ఉంది. సరే.. రివ్యూ కాల్‌లో మిస్-కమ్యూనికేషన్ జరిగి ఉండొచ్చు. కానీ.. ఈ విషయంపై వాళ్లు 3-4 నిమిషాలు మాట్లాడారు. ఇలాంటప్పుడు ‘మేటర్ ముగిసింది’ అని అంపైర్లు వివాదాన్ని ముగించేయాలే గానీ, కొనసాగించకూడదు. ఒకవేళ వాళ్లు వాదనని పొడిగిస్తే, అప్పుడు జరిమానా విధించాలి’’ అని గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 12:11 PM

Advertising
Advertising