ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: దుబాయ్‌లో దగ్గరైన సానియా మీర్జా, మహ్మద్ షమీ.. నిజమేనా..

ABN, Publish Date - Dec 24 , 2024 | 10:29 AM

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటివల వీరికి సంబంధించిన మరికొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

sania mirza shami

గత కొన్ని రోజులుగా భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami), భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితాలు వేరైనప్పటికీ అభిమానులు మాత్రం వీరిని వదలడం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దుబాయ్‌లో మహమ్మద్ షమీ, సానియా మీర్జా కలిసి ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షమీ, సానియా మీర్జా కలిసి దుబాయ్‌లో ఉన్నారని, బీచ్‌లో తిరుగుతున్నారని ఫేస్‌బుక్‌లో క్రికెట్.గురు అనే పేజీ పేర్కొంది. అదే పేజీలో వారిద్దరూ కలిసి ఉన్న చిత్రాలను కూడా షేర్ చేసింది. వీటిలో సానియా, షమీలు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ చిత్రాలను చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.


అసలు విషయం ఏంటంటే..

ఈ చిత్రాల గురించి ఫ్యాక్ట్ చెక్ చేయగా ఇది నిజం కాదని తేలింది. ఈ చిత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి రూపొందించారని తెలిసింది. అంతేకాదు మహ్మద్ షమీ స్వయంగా నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను ఒక రోజు క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా ప్రస్తుతం NCA (నేషనల్ క్రికెట్ అకాడమీ)లో ప్రాక్టీస్ చేస్తున్నానని షమీ పేర్కొన్నారు. NCA బెంగళూరులో ఉంది. దీంతో షమీ భారత్‌లో ఉన్నాడు, దుబాయ్‌లో లేడని రుజువైంది.


గతంలో వీరిద్దరికీ

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా ఇటీవలే విడాకులు తీసుకున్నారు. అదే సమయంలో మహ్మద్ షమీ కూడా తన భార్య హసిన్ జహాన్‌కు డివోస్ ఇచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరూ పేర్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇద్దరికీ క్రీడా నేపథ్యం ఉన్న క్రమంలో వీరు ఒక్కటవుతారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరికి సంబంధించి కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ చిత్రాలను చూసిన అభిమానులు నిజమా, కాదా అని తెలుసుకోకుండా నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై మాత్రం వీరిద్దరూ ఎప్పుడూ కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


ఇవి కూడా చదవండి:

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..

Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..


Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 24 , 2024 | 11:05 AM