వేలానికి స్టోక్స్ దూరం
ABN , Publish Date - Nov 07 , 2024 | 03:59 AM
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్ మెగా వేలం కోసం రిజిస్టర్ చేసుకొన్న 1574 మంది ఆటగాళ్ల జాబితాలో స్టోక్స్ పేరు లేదు. అయితే, ఆశ్చర్యకరంగా అతడి మాజీ సహచరుడు...
రూ. 2 కోట్ల జాబితాలో పంత్, అయ్యర్, షమి
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్ మెగా వేలం కోసం రిజిస్టర్ చేసుకొన్న 1574 మంది ఆటగాళ్ల జాబితాలో స్టోక్స్ పేరు లేదు. అయితే, ఆశ్చర్యకరంగా అతడి మాజీ సహచరుడు, వెటరన్ పేసర్ జిమ్మీ అండర్సన్ వేలానికి రావడం విశేషం. మెగా వేలం ఈ నెల 24, 25 తేదీలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకొనే ఆటగాళ్లను ఖరారు చేయడంతో.. కుదించిన జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ప్రతి ఫ్రాంచైజీ 25 మంది సభ్యుల జట్టును తయారు చేసుకోనుంది. ఇందులో భాగంగా 10 జట్లు 46 మందిని రిటైన్ చేసుకోగా.. 204 మందిని వేలంలో కొనుగోలు చేయనున్నాయి. గాయాలు, పని భారం కారణంగా స్టోక్స్ గతేడాది లీగ్‌కు దూరమయ్యాడు.
రూ. 2 కోట్లలో మనోళ్లు..: భారత ఆటగాళ్లు రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్, అశ్విన్, చాహల్ రూ. 2 కోట్ల కనీస ధర జాబితాలో పేర్లను నమోదు చేసుకొన్నారు. షమి, అర్ష్‌దీ్‌పతోపాటు సిరాజ్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్‌లు కూడా ఈ జాబితాలో రిజిస్టర్ చేసుకొన్నారు. కాగా సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా తమ పేర్లను రూ. 75 లక్షల కనీస ధర జాబితాలో నమోదు చేసుకొన్నారు.
అండర్సన్ తొలిసారి..: అండర్సన్ తొలిసారి ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేసుకోవడం విశేషం. 42 ఏళ్ల జిమ్మీ ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒక్క ఫ్రాంచైజీ లీగ్ కూడా ఆడని అండర్సన్ రూ. 1.25 కోట్ల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకొన్నాడు. టీ20 వరల్డ్‌క్‌పలో అందరి దృష్టినీ ఆకర్షించిన అమెరికా పేసర్ సౌరభ్ నేత్రావల్కర్, ఇటలీ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ థామస్ డ్రాకా రూ. 30 లక్షల కనీస ధర జాబితాలో రిజిస్టర్ చేసుకొన్నారు. గతేడాది అమ్ముడుపోని ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్‌తోపాటు రూ. 24.5 కోట్లు పలికిన పేసర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ కూడా రూ. 2 కోట్ల జాబితాలో వేలానికి రానున్నారు.