IPL Fraud: ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు.. క్యూఆర్ కోడ్స్ పంపించి..
ABN, Publish Date - Mar 30 , 2024 | 04:41 PM
ఇప్పుడు ఐపీఎల్ ట్రెండ్ నడుస్తుండటంతో.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరలకే తాము టికెట్లు అమ్ముతామంటూ క్యూఆర్ కోడ్ పంపించి, ప్రజల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్నారు.
ఇప్పుడు ఐపీఎల్ (IPL 2024) ట్రెండ్ నడుస్తుండటంతో.. సైబర్ నేరగాళ్లు (Cyber Crimes) రెచ్చిపోతున్నారు. తక్కువ ధరలకే తాము టికెట్లు (IPL Tickets) అమ్ముతామంటూ క్యూఆర్ కోడ్ పంపించి, ప్రజల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య మ్యాచ్ జరగనున్న తరుణంలో.. ఈ సైబర్ మోసం తెరమీదకి వచ్చింది.
Cyber Crimes: ఈ నంబర్ నుంచి మీకు కాల్స్ వస్తున్నాయా.. అయితే డేంజర్‌లో ఉన్నట్లే
నిజానికి.. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. దీంతో.. పేటీఎం (PayTM) ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయాలను నిలిపివేసింది. అయితే.. సైబర్ నేరగాళ్లు మాత్రం తమ వద్ద టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారు. తాము డిస్కౌంట్ ధరలకే అందిస్తామని ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా ఈ మేరకు సందేశాలు పంపుతున్నారు. అంతేకాదు.. క్యూఆర్ కోడ్ పంపించి, దానికి డబ్బులు పంపితే వెంటనే టికెట్లు పంపుతామని పేర్కొంటున్నారు. ఇది నిజమేనేమోనని భావించి, కొందరు క్రీడాభిమానులు ఆ క్యూఆర్ కోడ్‌కి డబ్బులు పంపించి మోసపోయారు.
Kejriwal Arrest: ఆ వ్యూహాల కోసమే కేజ్రీవాల్ ఫోన్‌పై దృష్టి.. ఆప్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
తాము డబ్బులు పంపించిన తర్వాత అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, టికెట్లకు సంబంధించిన వివరాలు రాకపోవడంతో.. తాము మోసపోయామని భావించి కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ సైబర్ మోసాల వెనుక ఎవరున్నారో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు.. ఇలాంటి మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క్యూఆర్ కోడ్‌కి డబ్బులు పంపించవద్దని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఐపీఎల్ టికెట్ల అమ్మకాలను అసలు నమ్మొద్దని, లేకపోతే మోసపోతారని అలర్ట్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 30 , 2024 | 04:53 PM