Suryakumar Yadav: సగం మ్యాచ్‌ల్లోనే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య.. శ్రీలంకతో మ్యాచ్‌లో కెప్టెన్ అరుదైన ఘనత!
ABN, Publish Date - Jul 28 , 2024 | 12:31 PM
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక సిరీస్‌లో మెరిశాడు. శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జట్టును విజయపథాన నడిపించాడు. 26 బంతుల్లో 223 స్ట్రైక్ రేట్‌తో 58 పరుగులు చేశాడు. టీమిండియాకు భారీ స్కోరు అందించాడు.
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) శ్రీలంక సిరీస్‌లో మెరిశాడు. శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో (Ind vs SL) జట్టును విజయపథాన నడిపించాడు. 26 బంతుల్లో 223 స్ట్రైక్ రేట్‌తో 58 పరుగులు చేశాడు. టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. ఛేదనలో చతికిలపడిన శ్రీలంక 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న సూర్యకుమార్ ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు (Suryakumar Yadav Record).
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
`లు అందుకున్న ఆటగాడిగా ఉన్న కోహ్లీ (Virat Kohli) రికార్డును సూర్య సమం చేశాడు. కోహ్లీ ఇప్పటివరకు 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
` అవార్డులు అందుకున్నాడు. తాజాగా లభించిన అవార్డుతో సూర్య కూడా 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
`లు సాధించాడు. అయితే 16 అవార్డులు అందుకోవడానికి కోహ్లీకి 125 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. సూర్య 69 మ్యాచ్‌ల్లోనే ఆ ఘనత సాధించాడు. వీరి తర్వాత జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా (91 మ్యాచ్‌ల్లో 15 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో అఫ్గానిస్తాన్‌కు చెందిన మహ్మద్ నబీ (129 మ్యాచ్‌ల్లో 14 సార్లు), రోహిత్ శర్మ (159 మ్యాచ్‌ల్లో 14 సార్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాలో ఉన్నారు. శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. ఆదివారం సాయంత్రం రెండో మ్యాచ్ జరగబోతోంది.
ఇవి కూడా చదవండి..
Womens Asia Cup Final: నేడు మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్ పోరు.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 28 , 2024 | 12:31 PM