T20 World Cup 2024: నేడే టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం.. కానీ ఇండియాలో మాత్రం
ABN, Publish Date - Jun 01 , 2024 | 09:03 AM
టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) క్రికెట్ టోర్నమెంట్ అగ్రరాజ్యం అమెరికా(america)లో నేడు (జూన్ 1) రాత్రి 7:30 గంటలకు న్యూయార్క్‌లో మొదలు కానుంది. అయితే అమెరికాలో నిర్వహించబడే T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌ల సమయం భారతదేశం టైమ్ జోన్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మ్యాచుని భారతదేశంలో ఏ సమయంలో చూడాలనేది తెలుసుకుందాం.
టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) క్రికెట్ టోర్నమెంట్ అగ్రరాజ్యం అమెరికా(america)లో నేడు (జూన్ 1) రాత్రి 7:30 గంటలకు న్యూయార్క్‌లో మొదలు కానుంది. అయితే అమెరికాలో నిర్వహించబడే T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌ల సమయం భారతదేశం టైమ్ జోన్‌కు భిన్నంగా ఉంటుంది. జూన్ 1న అమెరికా, కెనడా మధ్య తొలి మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కానీ ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం జూన్ 2న ఉదయం 06:00 గంటలకు జరుగుతుంది.
ఈ టోర్నీ భారత్(india)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం(live telecast) కానుంది. ఈ మ్యాచులు భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. దీంతోపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇక టీమిండియా తన T20 ప్రపంచ కప్ ప్రయాణాన్ని మొదట ఐర్లాండ్‌తో జూన్ 5, 2024న ప్రారంభించనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇక భారత జట్టులో రోహిత్ శర్మ (C), హార్దిక్ పాండ్యా (VC), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), సంజు శాంసన్ (VK), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఉండగా, శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వేటాడే ముందు పులి ఎంత సహనంగా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది..!
Viral Video: ఇదేం ఖర్మరా బాబూ.. నడిరోడ్డు మీద వింత స్టంట్లు ఎందుకోసమో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 01 , 2024 | 09:03 AM