Share News

Sania Mirza: సానియా మిర్జాతో షమీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తండ్రి!

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:53 PM

తమతమ భాగస్వామ్యులతో విడాకులు తీసుకొని వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు అనుభవించిన షమీ, సానియా మిర్జా.. ఇప్పుడు సరికొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి...

Sania Mirza: సానియా మిర్జాతో షమీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తండ్రి!
Sania Mirza

ప్రస్తుత సోషల్ మీడియా (Social Media) యుగంలో ‘ఫేక్ వార్త’ల ట్రెండ్ గురించి అందరికీ తెలిసిందేగా! లేనిపోనివన్ని కల్పించి, ఏవేవో వార్తలను సృష్టిస్తుంటారు. నిజానిజాలేంటో తెలుసుకోకుండా.. నెటిజన్లు సైతం ఆ వార్తల్ని నెట్టింట్లో వైరల్ చేస్తుంటారు. అలా చక్కర్లు కొడుతున్న ఫేక్ వార్తల్లో.. మహమ్మద్ షమీ (Mohammed Shami), సానియా మిర్జా (Sania Mirza) పెళ్లి వార్త ఒకటి. తమతమ భాగస్వామ్యులతో విడాకులు తీసుకొని వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు అనుభవించిన ఆ ఇద్దరు కలిసి ఇప్పుడు సరికొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఓ ప్రచారం జోరందుకుంది. అయితే.. ఇదంతా ఫేక్ అని సానియా తండ్రి క్లారిటీ ఇచ్చారు.


ఓ ఇంటర్వ్యూలో సానియా తండ్రి ఇమ్రాన్ (Sania Fathter Imran) మాట్లాడుతూ.. సానియా, షమీ పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇదంతా పచ్చి అబద్ధమని, అసలు సానియా ఇంతవరకూ షమీని వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని చెప్పారు. మరోవైపు.. షోయబ్ మాలిక్‌తో (Shoaib Mallik) విడాకులు తీసుకున్న ఐదు నెలల తర్వాత సానియా మిర్జా హజ్ యాత్రకు బయలుదేరింది. గతాన్ని మరచి, ఓ కొత్త లైఫ్‌స్టైల్‌ని మొదలుపెట్టాలని అనుకుంటున్నానని.. ఈ పరివర్తన కోసం తాను సిద్ధంగా ఉన్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తన ప్రయాణంలో చేసిన తప్పులకు క్షమాపణలు కోరిన ఆమె.. ఇకపై ఆ అల్లా తనని పవిత్ర మార్గంలో నడిపిస్తాడని ఆశిస్తున్నట్లు సానియా మిర్జా చెప్పుకొచ్చింది.


నిజానికి.. గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లను స్వయంగా మహమ్మద్ షమీ తోసిపుచ్చాడు. సానియా మిర్జా, తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వార్త చూశానని.. ఇది తన కెరీర్‌లోనే ఓ బిగ్గెస్ట్ రూమర్ అని తెలిపాడు. ఇదొక తప్పుడు ప్రచారమని పేర్కొన్నాడు. ఇదిలావుండగా.. ఈ ఏడాది ప్రారంభంలో సానియా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారు. మరోవైపు.. తన భార్య హసీన్ జహాన్ నుంచి మహమ్మద్ షమీ విడిపోయి చాలాకాలమే అవుతోంది. అయినప్పటికీ.. ఈ వ్యవహారంలో షమీకి ఇబ్బందులు తప్పడం లేదు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 01:11 PM