Longest Test match: 11 రోజులు.. 680 ఓవర్లు.. అంపైర్లకు చిరాకు తెప్పించిన ఆ టెస్ట్ మ్యాచ్ వివరాలు తెలిస్తే..
ABN , Publish Date - Sep 14 , 2024 | 03:17 PM
ప్రస్తుత ఆధునిక యుగంలో టీ20 క్రికెట్ వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లకు కూడా ఆదరణ క్రమంగా తగ్గుతోంది. అలాంటిది టెస్ట్ మ్యాచ్‌ల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఐదు రోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచ్ చూసేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు.
ప్రస్తుత ఆధునిక యుగంలో టీ20 క్రికెట్ (T20 Cricket) వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లకు కూడా ఆదరణ క్రమంగా తగ్గుతోంది. అలాంటిది టెస్ట్ మ్యాచ్‌ల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఐదు రోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచ్ చూసేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. అలాంటిది ఓ టెస్ట్ మ్యాచ్ (Test Match) 11 రోజుల పాటు సాగిందంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అన్ని రోజులు మ్యాచ్ సాగినా ఫలితం రాలేదంటే ఇంకెలా ఉంటుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన టెస్ట్ మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం.. (Longest test match)
85 ఏళ్ల క్రితం ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్ (Eng vs SA) టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనది. 1939లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లింది. ఆ సిరీస్‌లో చివరి మ్యాచ్ డర్బన్‌లో జరిగింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ అనెల్ మావెల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాలుగు రోజులు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 530 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండ్రోజులు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ 316 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మరో మూడ్రోజులు బ్యాటింగ్ చేసి 481 పరుగులు చేసింది.
మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం, రెండో ఇన్నింగ్స్ పరుగులు కలిపి ఇంగ్లండ్ ముందు 651 పరుగుల లక్ష్యం నిలిచింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్ బిల్ ఎడ్రిచ్ అద్వితీయంగా బ్యాటింగ్ చేశాడు. డబుల్ సెంచరీ చేసి ఇంగ్లండ్ టీమ్‌ను విజయం దిశగా నడిపించాడు. చివరకు 11వ రోజు నాటికి ఇంగ్లండ్ విజయానికి 42 పరుగుల దూరంలో నిలిచింది. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. ఆ దశలో మ్యాచ్‌ను అనివార్యంగా ఆపేయాల్సి వచ్చింది.
దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లండ్ వెళ్లే షిప్ బయలుదేరిపోతుండడంతో మ్యాచ్‌ను మధ్యలోనే వదిలేసి ఇంగ్లండ్ ఆటగాళ్లు వెళ్లిపోయారు. ఫలితం వచ్చే వరకు మ్యాచ్ ఆడాల్సిందేనని ముందుగానే ఇరు జట్ల ఆటగాళ్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే షిప్ ఇంగ్లండ్ విజయాన్ని అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లు, అంపైర్లు 11వ రోజు నాటికి విపరీతంగా అలసిపోయారు.
ఇవి కూడా చదవండి..
Team India: విదేశీయుడికి టీమ్ ఇండియా కొత్త బౌలింగ్ కోచ్ బాధ్యతలు
Virat Kohli: స్వదేశానికి వచ్చేసిన విరాట్.. మరో రికార్డుకు చేరువలో కోహ్లీ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..