ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vinesh Phogat: వెక్కి వెక్కి ఏడ్చిన వినేష్ ఫోగట్.. ఢిల్లీ చేరుకున్న క్రమంలో భావోద్వేగం..

ABN, Publish Date - Aug 17 , 2024 | 01:08 PM

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) ఈరోజు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమె ఢిల్లీ(delhi) విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె చాలా ఏడ్చింది. ఈ క్రమంలో వినేష్‌కు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు.

Vinesh Phogat emotional

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) ఈరోజు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమె ఢిల్లీ(delhi) విమానాశ్రయానికి చేరుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరినా కూడా పతకం రాలేదనే బాధ వినేష్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. అయితే చాలా రోజుల తర్వాత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఈ సమయంలో ఆమె చాలా ఏడ్చింది. ఈ క్రమంలో వినేష్‌కు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. వినేష్ బయటకు రాగానే ఇద్దరూ ఆమెను కౌగిలించుకున్నారు. ఆ సమయంలో వినేష్ ఇద్దరినీ కౌగిలించుకుని ఏడ్చేసింది.


ఘన స్వాగతం

ఆమె బజరంగ్, సాక్షితో కలిసి కారుపై నిలబడి ఏడుస్తూనే ఉన్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన క్రమంలో వినేష్ ఫోగట్ మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినప్పటికీ ఆమె ఖచ్చితంగా ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకుదని చెప్పవచ్చు. ఈ కారణంగానే వినేష్‌కి ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. వినేష్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానుుల తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే వినేష్ అభిమానులందరికీ ముకుళిత హస్తాలతో ధన్యవాదాలు తెలిపారు.


ఎలాంటి ఛాన్స్ అయినా..

వినేష్‌ ఎప్పటికీ ఫైటర్‌గానే ఉంటుందని ఈ సందర్భంగా సాక్షి మాలిక్ భర్త, రెజ్లర్ సత్యవరత్ కడియన్ తెలిపారు. మాకు ఛాంపియన్ అవడానికి ఉన్న ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టమబోమన్నారు. ఆమెను ఇప్పటికీ గోల్డ్ మెడలిస్ట్‌గా పరిగణిస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. వినేష్ దేశం కోసం ఏం చేయాలో అంత చేసిందని రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇలా చేయగలరని చెప్పారు. పతకం కోసం తన శాయశక్తులా ప్రయత్నించారని వెల్లడించారు.


100 గ్రాముల బరువు

అయితే ప్యారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల మహిళల రెజ్లింగ్ ఈవెంట్‌లో వినేష్ ఫోగట్ పోటీ పడ్డారు. ఆ క్రమంలో వినేష్ తన మొదటి మ్యాచ్‌లో స్వర్ణ పతక విజేత, గత ఒలింపిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్‌ను ఓడించింది. దీంతో క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీఫైనల్స్‌లో వినేష్‌ బలమైన విజయాన్ని నమోదు చేసింది. కానీ ఫైనల్ రోజు 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో అనర్హత వేటు పడిన తర్వాత వినేష్ రజత పతకాన్ని డిమాండ్ చేస్తూ సీఏఎస్‌ను ఆశ్రయించింది. ఆ సమయంలో దేశంలోని ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనను వినిపించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వాల్సిందిగా వినేష్‌ను సీఏఎస్ కోరింది. కానీ చివరకు అలా ఇవ్వలేమని తిరస్కరించారు.


ఇవి కూడా చదవండి:

Viral News: బ్రిటిష్ నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్.. నటషా రియాక్షన్ ఇందుకేనా?


PKL-11 : అజిత్‌, అర్జున్‌ జిగేల్‌


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 17 , 2024 | 01:09 PM

Advertising
Advertising
<