Viral Video: ఆధార్ కార్డ్ కోసం పరుగు తీసిన స్టార్ క్రికెటర్
ABN, Publish Date - Apr 24 , 2024 | 01:15 PM
ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్(David Warner) మరోసారి వార్తల్లో నిలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతా Xలో అతని వీడియోను పంచుకుంది. వీడియోలో ఆధార్ కార్డును తయారు చేసే వార్త విన్న తర్వాత వార్నర్ పరుగెత్తడం ప్రారంభించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఏం జరిగిందో మీరు కూడా తెలుసుకోండి మరి.
ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్(David Warner) మరోసారి వార్తల్లో నిలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతా Xలో అతని వీడియోను పంచుకుంది. వీడియోలో ఆధార్ కార్డును తయారు చేసే వార్త విన్న తర్వాత వార్నర్ పరుగెత్తడం ప్రారంభించాడు. వీడియోలో ఓ పొట్టి వ్యక్తి వార్నర్‌తో సంభాషించారు. ఆ క్రమంలో మనం వెళ్లి సినిమా చూద్దాం అని అడుగగా వార్నర్ దానికి తిరస్కరిస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు వెళదామని అడుగగా అందుకు కూడా నో అంటాడు. దీని తర్వాత అతను అక్కడ ఉచితంగా ఆధార్ కార్డ్(Aadhar card) ఇస్తున్నారని చెప్పడంతో దీంతో సంతోషించిన వార్నర్ ఆ వ్యక్తిని తన ఒడిలోకి తీసుకుని చలో చలో అంటూ పరుగు తీశాడు.
అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ ఎక్కడ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఫన్నీ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక వార్నర్(David Warner) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే గతంలో చాలా సందర్భాలలో అనేక వీడియోలలో కనిపించారు. బాహుబలి, పుష్ప వంటి డైలాగ్స్ చెప్పి సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకున్నారు. దీంతోపాటు అనేక సినిమా పాటలకు కూడా తనదైన శైలిలో డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుత సీజన్‌లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరఫున ఆడతుండగా, నేడు ఈ జట్టు గుజరాత్ టైటాన్స్(gujarat titans) జట్టుతో తలపడనుంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు పెద్దగా రాణించలేదు. కానీ వార్నర్ ఐపీఎల్‌లోని గొప్ప ఆటగాళ్ళలో ఒకరిగా ఉన్నారు. ఐపీఎల్(ipl) చరిత్రలో అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్ చేసిన ఘనత వార్నర్‌కు ఉంది. దీంతో పాటు కెప్టెన్‌గా ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలుచుకున్నాడు. వార్నర్ గాయం కారణంగా కొన్ని మ్యాచులకు దూరమయ్యారు. ఈరోజు మ్యాచుకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు.
ఇది కూడా చదవండి:
IPL 2024: నేడు DC vs GT మ్యాచ్.. గెలవకుంటే ప్లేఆఫ్ రేసు నుంచి
Read Latest Sports News and Telugu News
Updated Date - Apr 24 , 2024 | 01:18 PM